Effects of Papaya: బొప్పాయి తిన్న వెంటనే వీటిని తినేస్తున్నారా.. అయితే రిస్క్ లో పడ్డట్లే!

మనం తినే ఆహారాల్లో బొప్పాయి కూడా ఒకటి. సిటీల్లో అయితే వీటిని కొనుక్కుని తింటారు కానీ.. పల్లెటూర్లలో అయితే బొప్పాయి చెట్లు చాలా ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో వీటికి డిమాండ్ ఎక్కువ. బలవర్థకమైన పదార్థాల్లో బొప్పాయి కూడా ఒకటి. అదే విధంగా శరీరానికి చలవ కూడా చేస్తుంది. బొప్పాయి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం బొప్పాయిని వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. అయితే బొప్పాయి తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదట. దీని వల్ల శరీరానికి పలు రకాల దుష్ప్రభావాలు..

Effects of Papaya: బొప్పాయి తిన్న వెంటనే వీటిని తినేస్తున్నారా.. అయితే రిస్క్ లో పడ్డట్లే!
Papaya
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 24, 2023 | 11:45 PM

మనం తినే ఆహారాల్లో బొప్పాయి కూడా ఒకటి. సిటీల్లో అయితే వీటిని కొనుక్కుని తింటారు కానీ.. పల్లెటూర్లలో అయితే బొప్పాయి చెట్లు చాలా ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో వీటికి డిమాండ్ ఎక్కువ. బలవర్థకమైన పదార్థాల్లో బొప్పాయి కూడా ఒకటి. అదే విధంగా శరీరానికి చలవ కూడా చేస్తుంది. బొప్పాయి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం బొప్పాయిని వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. అయితే బొప్పాయి తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదట. దీని వల్ల శరీరానికి పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి బొప్పాయి తిన్న తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల ఉత్పత్తులు:

బొప్పాయి పండు తిన్న వెంటనే పాలు, పెరుగు, జున్ను, పాల ఉత్పత్తులు తీసుకోకూడదు. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను గ్రహించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి బొప్పాయి తిన్న తర్వాత వీటికి దూరంగా ఉండాలి. లేదంటే జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది. అంతే కాకుండా గ్యాస్, మలబద్ధకం, పొట్టలో వాపు వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గుడ్లు:

బొప్పాయి తిన్న తర్వాత గుడ్లను కూడా తీసుకోకూడదు. అలాగే ఎగ్స్ తో తయారు చేసిన ఆహారాన్ని కూడా తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అజీర్తి, పొట్ట సమస్యలు, వికారం వంటి వాటిని ఎదుర్కొనాల్సి వస్తుంది. మరి కొంత మందిలో అయితే వాంతులు కూడా అవ్వొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కూలింగ్ వాటర్:

సాధారణంగా ఏ పదార్థం తిన్నా వెంటనే నీరు తాగుతూ ఉంటారు. అలా బొప్పాయి తిన్న తర్వాత కూలింగ్ వాటర్ అస్సలు తాగ కూడదట. ఇలా తాగడం వల్ల బొప్పాయిలో ఉండే పోషకాలు శరీరానికి అందవు. అంతే కాకుండా జీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

ఫ్రూట్ సలాడ్:

బొప్పాయి తిన్న వెంటనే ఫ్రూట్ సలాడ్ కి కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. బొప్పాయి పండును తిన్న తర్వాత ఇతర పండ్లతో తయారు చేసిన సలాడ్ ను తినడం వల్ల జీర్ణ క్రియ దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ పండులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది అరగడానికి సమయం పడుతుంది. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
భారత ఒలింపిక్స్ బృందానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు
భారత ఒలింపిక్స్ బృందానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు