Vellulli Rasam: వెల్లుల్లి రసాన్ని ఇలా చేయండి.. రోగ నిరోధక శక్తిని పెంచుకోండి!

మనం నిత్యం తీసుకునే ఆహారాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లితో రుచితో పాటు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. వెల్లుల్లితో కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయుర్వేదంలో కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి వెల్లుల్లి ఔషధంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు మారినప్పుడల్లా వచ్చే వ్యాధులను తగ్గించడానికి వెల్లుల్లి బాగా ఉపయోగ పడుతుంది. వర్షా కాలం, శీతా కాలంలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటివి దరి చేరకుండా చూడటంలో వెల్లుల్లి ఎంతో బాగా సహాయ పడుతుంది. ఇమ్యూనిటీని పెంచే ఆహారాల్లో..

Vellulli Rasam: వెల్లుల్లి రసాన్ని ఇలా చేయండి.. రోగ నిరోధక శక్తిని పెంచుకోండి!
Cooking Tips
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 25, 2023 | 10:55 PM

మనం నిత్యం తీసుకునే ఆహారాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లితో రుచితో పాటు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. వెల్లుల్లితో కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయుర్వేదంలో కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి వెల్లుల్లి ఔషధంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు మారినప్పుడల్లా వచ్చే వ్యాధులను తగ్గించడానికి వెల్లుల్లి బాగా ఉపయోగ పడుతుంది. వర్షా కాలం, శీతా కాలంలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటివి దరి చేరకుండా చూడటంలో వెల్లుల్లి ఎంతో బాగా సహాయ పడుతుంది. ఇమ్యూనిటీని పెంచే ఆహారాల్లో ఇది కూడా ఒకటి. వింటర్ సీజన్ లో అయితే వెల్లుల్లి బాగా ఉపయోగ పడుతుంది. శీతా కాలంలో వెల్లుల్లితో తయారు చేసే రసాన్ని తీసుకోవడం వల్ల చలి నుంచి రిలీఫ్ పొందవచ్చు. మరి ఈ వెల్లుల్లి రసాన్ని ఎలా తయారు చేస్తారు? వెల్లుల్లి రసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి రసానికి కావాల్సిన పదార్థాలు:

వెల్లుల్లి పాయలు, చింత పండు, టమాటా, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కారం, పసుపు, ఉప్పు, జీల కర్ర, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ, కొత్తి మీర, నూనె, మెంతులు, ధనియాలు, కంది పప్పు, నువ్వులు.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి రసం తయారీ విధానం:

ముందుగా ఒక కడాయి తీసుకుని మసాలా పొడికి కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి. మెంతులు, ధనియాలు, కంది పప్పు, నువ్వులు, జీల కర్ర ఒక్కొక్కటిగా వేసి వేయించు కోవాలి. తర్వాత వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసు కోవాలి. ఇప్పుడు లోతైన పాత్ర తీసుకుని అందులో చింత పండు రసం, టమాటా, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి.. చేతితో రసాన్ని బాగా పిండు కోవాలి. పప్పిని తీసేసి రసాన్ని పక్కకు ఉంచు కోవాలి. వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచు కోవాలి.

ఇప్పుడు కడాయి తీసుకుని ఆయిల్ వేసి వేడి చేసు కోవాలి. జీల కర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించు కోవాలి. తర్వాత ఇంగువ, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లులి రెబ్బలు వేసి కాసేపు వేయించాక.. ఉప్పు, కారం, పసుపు వేసి మరో నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత చింత పండు రసం, నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసి బాగా కలుపు కోవాలి. ఈ రసాన్ని బాగా మరిగించు కోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తి మీర చల్లుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి రసం సిద్ధం.