Dandruff Problem at Winter: చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువ అవుతుందా.. ఇలా చేస్తే సరి!
చుండ్రు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ చుండ్రు ముఖం, బాడీ, భుజాలపై పడి చిరాకుగా కనిపిస్తుంది. దీంతో నలుగురిలో తిరిగేందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంతే కాకుండా జుట్టు రాలి పోవడానికి కూడా ఈ చుండ్రు కూడా ఒక కారణం. ఈ చుండ్రు కారణంగా కూడా పదే పేద తలలో దురదగా అనిపిస్తుంది. మనసుతీరా గోకితే కానీ.. ఆ దురద తీరదు. ఇలా బలంగా తలపై గోకడం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే చలా కాలంలో ఈ సమస్య..
చుండ్రు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ చుండ్రు ముఖం, బాడీ, భుజాలపై పడి చిరాకుగా కనిపిస్తుంది. దీంతో నలుగురిలో తిరిగేందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంతే కాకుండా జుట్టు రాలి పోవడానికి కూడా ఈ చుండ్రు కూడా ఒక కారణం. ఈ చుండ్రు కారణంగా కూడా పదే పేద తలలో దురదగా అనిపిస్తుంది. మనసుతీరా గోకితే కానీ.. ఆ దురద తీరదు. ఇలా బలంగా తలపై గోకడం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే చలా కాలంలో ఈ సమస్య మరింతగా ఉంటుంది.
ఈ చుండ్రును తగ్గించుకునేందుకు చాలా మంది ఎన్నో రకరకాల టిప్స్ ని ఫాలో చేసే ఉంటారు. అలాగే మార్కెట్లో దొరికే ఎన్నో రకరకాల ప్రాడెక్ట్స్ ని యూజ్ చేస్తూంటారు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా ఫేస్ చేసే ఉంటారు. ఇలా ఈ చుండ్రు సమస్యను తగ్గించు కోవాలంటే సింపుల్ గా ఇంట్లోనే ఈ చిట్కాలు ఫాలో చేస్తే సరి పోతుంది. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ సైడర్ వెనిగర్:
చుండ్రు సమస్యను తగ్గించుకునేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ బాగా ఉపయోగ పడుతుంది. ఇందులో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చుండ్రుకు కారణం అయిన ఫంగస్ ను తొలగిస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా నీటిని, యాపిల్ సైడర్ వెనిగర్ ను సమ భాగాలుగా తీసుకుని.. కలుపుకోవాలి. దీన్ని మీ తలకు బాగా పట్టంచాలి. ఓ 20 నిమిషాల తర్వాత తలను శుభ్రం చేసుకుంటే సరి పోతుంది.
కొబ్బరి నూనె:
చుండ్రును తగ్గించడంలో కొబ్బరి నూనె కూడా బాగా పని చేస్తుంది. కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల జుట్టు పొడి బారడాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెను గోరు వెచ్చగా వేడి చేసి తలపై రాసి మసాజ్ చేయాలి. ఇలా చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగి, కుదుళ్లకు బలం పెరుగుతుంది. కొద్ది రోజుల్లో జుట్టు రాలడం కూడా తగ్గి పోతుంది. అంతే కాకుండా చుండ్రు కూడా తగ్గుతుంది.
అలోవెరా:
అలోవెరాను రాసుకోవడం వల్ల మాడుపై ఉండే దురద, ఇరిటేషన్ ను తగ్గిస్తుంది. కలబందను నేరుగా తలపై రాసి.. ఓ అరగంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.
బేకింగ్ సోడా:
బేకింగ్ సోడా కూడా చుండ్రు తగ్గించడంలో ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు వేసి కలిపాలి. ఆ తర్వాత దాన్ని తలపై రాసి.. ఆరిపోయేంత వరకు ఉంచాలి. తర్వాత హెడ్ బాత్ చేయడం వల్ల చుండ్రు త్వరగా తగ్గుతుంది. అయితే ఈ చిట్కాను ఎక్కువ సార్లు ట్రై చేయకూడదు. దీని వల్ల జుట్టు పొడిబారి.. ఊడిపోయే అవకాశం ఉంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.