AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cardamom health benefits: రోజూ రెండు యాలకులు తినండి.. డాక్టర్ కి దూరంగా ఉండండి!

వంటిల్లే వైద్య శాల అని పెద్దలు ఊరికే అనలేదు. వంటింట్లో ఉండే కొన్ని రకాల సరుకులతో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇలా మన వంటింట్లో ఉండే వాటిల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులను తరచూ తీసుకుంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు బై చెప్పవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తరచూ తీసుకుంటే జీర్ణ సమస్యలు, గ్యాస్, మల బద్ధకం, కడుపులో నొప్పి వంటి వాటిని దూరంగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా దంత క్షయం నుంచి కూడా రిలీఫ్ దొరుకుతుంది. పురుషులు యాలకులను తీసుకోవడం వల్ల వారిలో శారీరక సామార్థ్యం..

Cardamom health benefits: రోజూ రెండు యాలకులు తినండి.. డాక్టర్ కి దూరంగా ఉండండి!
Cardamom
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 24, 2023 | 7:45 PM

Share

వంటిల్లే వైద్య శాల అని పెద్దలు ఊరికే అనలేదు. వంటింట్లో ఉండే కొన్ని రకాల సరుకులతో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇలా మన వంటింట్లో ఉండే వాటిల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులను తరచూ తీసుకుంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు బై చెప్పవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తరచూ తీసుకుంటే జీర్ణ సమస్యలు, గ్యాస్, మల బద్ధకం, కడుపులో నొప్పి వంటి వాటిని దూరంగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా దంత క్షయం నుంచి కూడా రిలీఫ్ దొరుకుతుంది. పురుషులు యాలకులను తీసుకోవడం వల్ల వారిలో శారీరక సామార్థ్యం అనేది పెరుగుతుంది. ఇంకా యాలకులతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పురుషులకు ప్రయోజనం:

రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలల్లో రెండు యాలకులను కలిపి తీసుకోవడం వల్ల లైంగిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. అంతే కాకుండా క్రమం తప్పకుండా తీసుకుంటే పురుషుల్లో నపుంసకత్వము కూడా తొలగిపోతుంది.

ఇవి కూడా చదవండి

నోటి దుర్వాసన పోతుంది:

యాలకులను తరచూ తినడం వల్ల నోటి నుంచి దుర్వాసన అనేది దూరం అవుతుంది. నోరు ఫ్రెష్ గా ఉంటుంది.

క్యాన్సర్ దూరం అవుతుంది:

యాలకుల్లో క్యాన్సర్ నిరోధక గుణాలు అధికంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాన్సర్ కణాలు అనేవి తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. క్యాన్సర్ ఉన్న వారు తీసుకుంటే.. క్యాన్సర్ ను దూరం చేసుకోవచ్చు.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది:

మీరు తినే ఆహారంలో యాలకులను చేర్చు కోవడం వల్ల గుండె జబ్బులను తగ్గించు కోవచ్చు. యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

కాలేయం హెల్దీగా ఉంటుంది:

యాలకులను తినడం వల్ల కాలేయం కూడా ఆరోగ్యంగా పని చేస్తుంది. కాలయే సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. యాలకుల్లో ఉండే డిటాక్సిఫైయింగ్ ఏజెంట్.. శరీరంలో ఉండే టాక్సిన్ లను తొలగిస్తుంది.

బరువు తగ్గుతారు:

బరువు తగ్గాలి అనుకున్న వారు తమ డైట్ లో యాలకులను చేర్చు కోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వొచ్చు. యాలకుల్లో ఉండే పోషకాలు బరువు పెరగకుండా చూస్తుంది.

నిద్ర లేమి సమస్యలు తగ్గుతాయి:

యాలకులను క్రమం తప్పకుండా ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. నిద్ర పట్టని వారు యాలకులను వేడి నీటితో కలిపి తాగితే.. నిద్రను ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా నిద్రలో వచ్చే గురక సమస్య కూడా తగ్గుతుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో