Hair Growth Tips: జుట్టుని ఒత్తుగా, పొడుగ్గా మార్చే చిట్కాలు.. మీకోసమే!

ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం అనేది అందరికీ ఒక సమస్యగా మారింది. అందాన్ని రెట్టింపు చేయడంలో జుట్టు కూడా ముందు ఉంటుంది. అందరూ పొడవైన, అందమైన జుట్టు కావాలని అనుకుంటారు. దీని కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడి ఉంటారు. అయితే కొంత మందికి ఈ ప్రోడక్ట్స్ అనేవి పడవు. అలాగే మారిన జీవన శైలిలో ఒత్తిడి, టెన్షన్స్, భయాందోళన, నిద్ర, ఆహారం వంటి కారణాల వల్ల జుట్టు రాలి పోవడానికి కారణాలు ఉంటాయి. అయితే హెయిర్ విషయంలో కొన్ని రకాల పద్దతులను..

Hair Growth Tips: జుట్టుని ఒత్తుగా, పొడుగ్గా మార్చే చిట్కాలు.. మీకోసమే!
Hair Fall
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 24, 2023 | 7:30 PM

ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం అనేది అందరికీ ఒక సమస్యగా మారింది. అందాన్ని రెట్టింపు చేయడంలో జుట్టు కూడా ముందు ఉంటుంది. అందరూ పొడవైన, అందమైన జుట్టు కావాలని అనుకుంటారు. దీని కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడి ఉంటారు. అయితే కొంత మందికి ఈ ప్రోడక్ట్స్ అనేవి పడవు. అలాగే మారిన జీవన శైలిలో ఒత్తిడి, టెన్షన్స్, భయాందోళన, నిద్ర, ఆహారం వంటి కారణాల వల్ల జుట్టు రాలి పోవడానికి కారణాలు ఉంటాయి. అయితే హెయిర్ విషయంలో కొన్ని రకాల పద్దతులను ఫాలో అయితే మాత్రం జుట్టును కాపాడుకోవచ్చు.

ట్రిమ్మింగ్ చేయడం:

జుట్టు పొడుగ్గా పెరగాలంటే ట్రిమ్మింగ్ చేయడం చాలా అవసరం. 8 నుంచి 10 వారాలకు ఒక సారి జుట్టును కత్తిరిస్తూ ఉండాలి. ఇలా చేస్తే జుట్టు అనేది ఫాస్ట్ గా గ్రోత్ అవుతూ ఉంటుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అయితే వేసవి కాలంలో మాత్రం ఎండ వేడి కారణంగా హెయిర్ ఎక్కువగా రాలి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వేసవి కాలంలో మాత్రం జుట్టును కత్తిరించకూడదట.

ఇవి కూడా చదవండి

కండిషనర్:

జుట్టు స్ట్రాంగ్ గా, బలంగా ఉండాలంటే కండిషనింగ్ తప్పని సరి అని అంటున్నారు నిపుణులు. హెయిర్ కు కండిషనర్ లేక పోవడం వల్ల జుట్టుకు పోషకాలు అందే ఛాన్స్ తగ్గి పోతుందట. కాబట్టి హెడ్ బాత్ చేసేటప్పుడు తప్పకుండా జుట్టుకు కండిషనర్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. కండీషనర్ పెట్టడం వల్ల జుట్టు అనేది స్కిల్ అండ్ స్మూత్ గా, షైనీగా ఉంటుంది.

వేడి నూనెతో మసాజ్ చేయాలి:

జుట్టుకు గోరు వెచ్చని నూనెతో మసాజ్ చేయడం వల్ల మంచి పోషణ అందుతుంది. అప్పుడప్పుడు మాడుపై మసాజ్ చేయడం వలన రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. దీంతో కుదుళ్లు బలంగా, దృఢంగా తయారవుతుంది. అంతే కాకుండా నిర్జీవంగా ఉన్న జుట్టు మెరుస్తూ షైనీగా మారుతుంది. తప్పకుండా జుట్టుకు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయాల్సి ఉంటుంది.

జుట్టును దువ్వడం:

హెయిర్ కి మసాజ్ చేసిన తర్వాత దువ్వడం చాలా మంచిది. అంతే కాకుండా కనీసం జుట్టును రోజుకు మూడు సార్లు దువ్వడం వల్ల రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. అంతే కాకుండా జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు