AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medicine for Diabetes: షుగర్ ఉన్నవారికి ఇకపై నో టెన్షన్.. ఏడాదికి మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది!

ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధితో బాధ పడే వారి సంఖ్య రోజు రోజుకూ ఎక్కువ అవుతుంది. ఇది వరకూ కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు చిన్నా పెద్దా అనే వయసుతో సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తుంది. దీనికి ప్రధానమైన కారణం మారిన జీవన విధానం. వ్యాయామం లేకపోవడం, బరువు పెరిగి పోవడం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం, సరైన నిద్ర లేక పోవడం ఇలా రకరకాల కారణాలతో ఈ డయాబెటీస్ వ్యాధి మహమ్మారిలా మారింది. అయితే షుగర్ వచ్చిన వారి సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏం తినాలన్నా.. తాగాలన్నా భయమే. మెడిసిన్ వాడినా తీసుకునే ఫుడ్ అనేది..

Medicine for Diabetes: షుగర్ ఉన్నవారికి ఇకపై నో టెన్షన్.. ఏడాదికి మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది!
Drug
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 24, 2023 | 9:30 PM

Share

ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధితో బాధ పడే వారి సంఖ్య రోజు రోజుకూ ఎక్కువ అవుతుంది. ఇది వరకూ కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు చిన్నా పెద్దా అనే వయసుతో సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తుంది. దీనికి ప్రధానమైన కారణం మారిన జీవన విధానం. వ్యాయామం లేకపోవడం, బరువు పెరిగి పోవడం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం, సరైన నిద్ర లేక పోవడం ఇలా రకరకాల కారణాలతో ఈ డయాబెటీస్ వ్యాధి మహమ్మారిలా మారింది.

భారత్ లో రోజు రోజుకూ పెరిగి పోతున్న షుగర్ వ్యాధి గ్రస్తులు:

అయితే షుగర్ వచ్చిన వారి సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏం తినాలన్నా.. తాగాలన్నా భయమే. మెడిసిన్ వాడినా తీసుకునే ఫుడ్ అనేది కంట్రోల్ లో ఉండాలి. లేదంటే చాలా కష్టం. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. కేవలం భారత దేశంలోనే 101 మిలియన్లకు పైగానే మధుమేహ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఎలా ఉందో.. రోజు రోజుకూ భారత్ లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య అనేది పెరిగి పోతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

మెడిసిన్ తీసుకున్నా ఆహారం విషయంలో కంట్రోల్ గా ఉండాలి:

అయితే ఇప్పటి వరకూ షుగర్ ని కంట్రోల్ చేయడానికి కేవలం మందులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం లభించింది. డయాబెటీస్ అనేది ఒక్కసారి వస్తే.. నయం అయ్యేది కాదు. దీన్ని పూర్తిగా నయం చేసే చికిత్స కూడా లేదు. అయితే కేవలం సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవడమే. అంతే కాకుండా వీటితో పాటు తప్పని సరిగా మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో డయాబెటీస్ కు సరైన మందును కని పెట్టడంలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

ఏడాదికి మూడు సార్లు మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరి పోతుంది:

తాజాగా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు.. హైడ్రోజెల్ ఆధారిత ఇంజెక్షన్ ను అభివృద్ధి చేశారు. దీని వల్ల ఏడాదికి మూడు సార్లు మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరి పోతుందని పేర్కొన్నారు. ఈ వార్తతో కాస్త ఉపశమనం లభించినట్టైంది మధు మేహ వ్యాధిగ్రస్తులకు. మొదట ఈ ప్రయోగాన్ని ఎలుకలపై ప్రయోగించారట. 42 రోజులకు ఒకసారి ఎలుకలకు హైడ్రోజెల్ ను ఇంజెక్ట్ చేసి పరిశీలించగా.. బ్లడ్ లో గ్లూకోజ్ లెవల్స్ అనేవి కంట్రోల్ లోకి వచ్చాయట.

ఎలుకల్లో ఈ ట్రయల్ సక్సెస్ అయ్యింది:

అంతే కాకుండా బరువు కూడా అదుపులోకి వచ్చినట్టు తెలిపారు. ఎలుకల్లో 42 రోజుల దినచర్య అంటే మనషుల్లో నాలుగు నెలలకు సమానమని సైంటిస్టుల బృందం వెల్లడించింది. ఇక ఈ ప్రయోగాన్ని ఆ తర్వాత పందులపై కూడా ప్రయోగిస్తామని తెలిపారు. అంతే కాకుండా ఈ ట్రయల్స్ ని రెండు సంవత్సరాల్లో మనుషులపై కూడా చేస్తామని పేర్కొన్నారు సైంటిస్టులు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.