AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖంపై పిగ్మంటేషన్, నల్లటి మచ్చలతో బాధపడుతున్నారా? వంటింట్లోని ఈ ఒక్క వస్తువుతో 2 వారాల్లోనే మెరిసే చర్మం మీ సొంతం!

అందమైన ముఖంపై నల్లటి మచ్చలు లేదా పిగ్మంటేషన్ రావడం చాలామందిని వేధించే ప్రధాన సమస్య. చర్మంలో మెలనిన్ ఉత్పత్తి పరిమితికి మించి పెరిగినప్పుడు బుగ్గలు, నుదురు, ముక్కుపై ఈ నల్లటి మచ్చలు ఏర్పడతాయి. మార్కెట్లో లభించే ఖరీదైన క్రీములు వాడినా కొందరికి ఫలితం ఉండదు. అయితే, మన వంటింట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే బంగాళాదుంపతో ఈ సమస్యకు చాలా సులభంగా, సహజ సిద్ధంగా గుడ్‌బై చెప్పవచ్చునని మీకు తెలుసా..? అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ముఖంపై పిగ్మంటేషన్, నల్లటి మచ్చలతో బాధపడుతున్నారా? వంటింట్లోని ఈ ఒక్క వస్తువుతో 2 వారాల్లోనే మెరిసే చర్మం మీ సొంతం!
Potato For Pigmentation
Jyothi Gadda
|

Updated on: Aug 12, 2026 | 8:08 PM

Share

మీ ముఖంపై నల్లటి మచ్చలు కనిపిస్తే , అది బహుష పిగ్మెంటేషన్‌ కావొచ్చు. ఈ నల్లటి మచ్చలు ఎంత అందమైన ముఖాన్ని అయినా కళా విహీనంగా మార్చగలవు. చర్మంలో అధిక మెలనిన్ ఉత్పత్తి కావడం వల్ల ఈ వర్ణద్రవ్యం లేదా పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. నిజం ఏమిటంటే, వాటిని దేనితోనూ దాచలేము. ఈ రోజుల్లో, దాదాపు ప్రతి మహిళ ఇదే సమస్యతో ఇబ్బంది పడుతోంది. ఈ మచ్చలు చెంపలు, నుదుటిపై ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నల్లటి మచ్చలను తేలికపరచడంలో బంగాళాదుంపలతో సహా కొన్ని గృహోపకరణాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. పిగ్మంటేషన్‌పై బంగాళాదుంప ఎలా పనిచేస్తుంది? తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

బంగాళాదుంపలో సహజ సిద్ధమైన బ్లీచింగ్ గుణాలు, చర్మానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న నల్లటి మచ్చల తీవ్రతను తగ్గించి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడతాయి. దీనికోసం బంగాళాదుంపను తురిమి, దాని నుంచి రసాన్ని వేరు చేయాలి. ఈ రసాన్ని దూది సాయంతో ముఖంలోని నల్లటి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై స్వచ్ఛమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే మంచి మార్పు కనిపిస్తుంది.

బంగాళాదుంప + నిమ్మరసం ప్యాక్:

నల్లటి మచ్చలు చాలా ఎక్కువగా ఉన్నట్లయితే, సమ పరిమాణంలో బంగాళాదుంప రసం, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. నిమ్మలోని విటమిన్ C మచ్చలను త్వరగా నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

బంగాళాదుంప + తేనె ప్యాక్:

ఒక స్పూన్ బంగాళాదుంప రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20-25 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేయాలి. తేనెలోని ఆంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మానికి తేమను, సహజ సిద్ధమైన కాంతిని ఇస్తాయి.

ఆలూ స్లైస్ మసాజ్:

రసం తీసే సమయం లేకపోతే, బంగాళాదుంపను పలుచని చక్రాల్లా కోసి, ఆ ముక్కలతో ముఖంపై నల్లటి మచ్చలున్న చోట 10-15 నిమిషాల పాటు మెల్లగా రుద్దాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us