Immunity Boosting Foods: జ్వరం తగ్గాక ఈ ఆహార పదార్థాలను ఖచ్చితంగా తీసుకోండి!

సాధారణంగా వాతారణ పరిస్థితులు మారినప్పుడు లేదా శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గినప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది. జ్వరంలో ఉన్నప్పుడు ఏమీ తినాలని అనిపించదు. దీంతో బాడీలో ఉన్న ఇమ్యూనిటీ కూడా తగ్గి పోతుంది. చాలా నీరసంగా ఉంటుంది. ఇలా ఓ రెండు, మూడు రోజులకు జ్వరం అనేది తగ్గుముఖం పడుతుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. జ్వరం తగ్గిపోయాక కొన్ని రకాల ఆహార పదార్థాలు అనేవి తప్పని సరిగా..

Immunity Boosting Foods: జ్వరం తగ్గాక ఈ ఆహార పదార్థాలను ఖచ్చితంగా తీసుకోండి!
Fever
Follow us
Chinni Enni

| Edited By: TV9 Telugu

Updated on: Nov 25, 2023 | 1:26 PM

సాధారణంగా వాతారణ పరిస్థితులు మారినప్పుడు లేదా శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గినప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది. జ్వరంలో ఉన్నప్పుడు ఏమీ తినాలని అనిపించదు. దీంతో బాడీలో ఉన్న ఇమ్యూనిటీ కూడా తగ్గి పోతుంది. చాలా నీరసంగా ఉంటుంది. ఇలా ఓ రెండు, మూడు రోజులకు జ్వరం అనేది తగ్గుముఖం పడుతుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. జ్వరం తగ్గిపోయాక కొన్ని రకాల ఆహార పదార్థాలు అనేవి తప్పని సరిగా తీసుకోవాలట. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కరివేపాకు:

కరివే పాకులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జ్వరం వచ్చి తగ్గి పోయిన తర్వాత కోలుకోవడానికి కరివే పాకును ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

వెజిటేబుల్ సూప్:

సాధారణంగా జ్వరంలో ఉన్నా.. జ్వరం తగ్గిన తర్వాత అయినా ఆహారం తీసుకోవడానికి ఇష్ట పడరు. కేవలం ద్రవ పదార్థాలను తాగడానికే ఇష్ట పడతారు. ఇలాంటప్పుడు సూప్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. జ్వరంలో ఉన్నా, తగ్గిపోయిన తర్వాత వెజిటేబుల్స్ తయారు చేసిన సూప్స్ తాగడం వల్ల నోరు బావుంటుంది. అంతే కాకుండా ఈ సూప్స్ లో ఉండే విటమిన్లు, పోషకాలు మిమ్మల్ని త్వరగా కోలుకోవడానికి సహాయ పడతాయి.

అల్లం టీ:

అల్లం టీ మీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జ్వరం వల్ల కలిగే అలసటను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా మీ ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. అంతే కాకుండా తక్షణమే ఎనర్జీ ఇస్తుంది.

దానిమ్మ:

జ్వరం వల్ల కలిగే నీరసం, బలహీనత, అలసటను పోగొట్టుకోవడానికి దానిమ్మ పండు బాగా ఉపయోగ పడుతుంది. దానిమ్మ కాయ మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు హెల్ప్ చేస్తుంది. జ్వరం తర్వాత దానిమ్మ పండు తిన్నా లేక జ్యూస్ తాగినా ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి.

కొబ్బరి నీరు:

కొబ్బరి నీరు ఎంత ఆరోగ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని జ్వరంలో ఉన్నప్పుడు తాగితే త్వరగా కోలుకునేందుకు సహయ పడుతుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. నీరసం అనేది తగ్గుతుంది.

అరటి పండ్లు:

జ్వరంలో ఉన్నప్పుడు లేదా తగ్గినప్పుడు అరటి పండ్లను తినడం వల్ల తక్షణమే ఎనర్జీ లభిస్తుంది. అంతే కాకుండా అరటి పళ్లు జీర్ణ వ్యవస్థను సులభతరం చేస్తుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి