Watch: లేట్‌గా వచ్చారు.. వందే భారత్‌నే వెయిట్ చేయమన్నారు! లోకో పైలట్ ఏం చేశారో తెలుసా?
ప్లాట్‌ఫామ్‌కు ఆలస్యంగా చేరుకున్న ఓ మహిళ.. అప్పటికే కదులుతున్న వందే భారత్ రైలును ఆపాలంటూ లోకో పైలట్‌ను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ సామానుతో ప్లాట్‌ఫామ్‌పై నిలబడి చేతులు జోడిస్తూ రైలును ఆపాలని ఆమె చేసిన ప్రయత్నం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్లాట్‌ఫామ్‌కు ఆలస్యంగా చేరుకున్న ఓ మహిళ.. అప్పటికే కదులుతున్న వందే భారత్ రైలును ఆపాలంటూ లోకో పైలట్‌ను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ సామానుతో ప్లాట్‌ఫామ్‌పై నిలబడి చేతులు జోడిస్తూ రైలును ఆపాలని ఆమె చేసిన ప్రయత్నం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైరల్ వీడియోలో వందే భారత్ రైలు ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరుతున్న సమయంలో మహిళ పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆమె వద్ద బరువైన సామాను ఉన్నట్లు కనిపిస్తోంది. అప్పటికే రైలు కదలడం ప్రారంభించడంతో.. తాను రైలును మిస్ అయ్యే పరిస్థితి వచ్చిందని గ్రహించిన ఆమె, చేతులు జోడించి లోకో పైలట్‌కు రైలును ఆపాలంటూ వేడుకుంది.
కదులుతున్న రైలు వైపు ఆమె పదేపదే చేతులు ఊపుతూ తనను ఎక్కించుకోవాలని వేడుకుంటున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఈ సమయంలో రైలు వేగం కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే రైలు పూర్తిగా ఆగిందా? ఆ మహిళ చివరకు రైలు ఎక్కగలిగిందా? అనే విషయం వైరల్ వీడియోలో స్పష్టంగా తెలియడం లేదు. అలాగే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాలు కూడా వీడియో ద్వారా తెలియదు.
ఈ ఘటనపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు మహిళ పరిస్థితిని అర్థం చేసుకుని లోకో పైలట్ స్పందించినట్లయితే అది మానవత్వంతో కూడిన చర్య అని ప్రశంసిస్తున్నారు. ప్రయాణికురాలి వద్ద భారీ సామాను ఉండటం, రైలు మిస్ అయితే ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో పైలట్ స్పందించాడని కొందరు అభిప్రాయపడ్డారు. మరోవైపు, సమయానికి స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులకు ఆలస్యంగా వచ్చిన వ్యక్తి కారణంగా అసౌకర్యం కలగకూడదని మరికొందరు వాదిస్తున్నారు. రైళ్లకు నిర్ణీత సమయ పట్టిక ఉంటుందని, ముఖ్యంగా వేగవంతమైన రైళ్లను వ్యక్తిగత కారణాలతో నిలిపివేయడం సరికాదని అంటున్నారు.
ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలని పలువురు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సహాయం తీసుకోవడం తప్ప.. కదులుతున్న రైలును ఆపేందుకు ప్రయత్నించడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
Missing the Vande Bharat train by just 60 seconds, a traveler desperately pleads with the engine driver to stop. pic.twitter.com/L28Fd8l37z
— King (@King_Ikshvaku) August 10, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
