AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టిన కొన్ని గంటల్లో ఎంత తేడా.. ఆడ శిశువులు ముఖాలనే ఎక్కువగా చూస్తారట!

పుట్టిన వెంటనే పిల్లలు ఏం గమనిస్తారు? మనుషుల ముఖాలా.. వస్తువులా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో ఆడ, మగ శిశువుల మధ్య కొన్ని తేడాలు కనిపించాయి. ముఖ్యంగా.. ఆడ శిశువులు మనుషుల ముఖాలను ఎక్కువసేపు చూడగా, మగ శిశువులు వస్తువుల వైపు ఎక్కువగా దృష్టి పెట్టినట్లు పరిశోధకులు గుర్తించారు.

పుట్టిన కొన్ని గంటల్లో ఎంత తేడా.. ఆడ శిశువులు ముఖాలనే ఎక్కువగా చూస్తారట!
Newborn Girls Spend More Time Looking At Human Face Compared To Boys
Sharada V
|

Updated on: Sep 23, 2026 | 7:50 PM

Share

ఈ  అధ్యయనంలో 130 మంది నవజాత శిశువులను పరిశీలించారు. వారికి రెండు రకాల దృశ్యాలను పక్కపక్కనే చూపించారు. ఒక వైపు సహజంగా కదులుతున్న మనిషి ముఖం ఉండగా.. మరో వైపు ఊగుతున్న బంతుల దృశ్యాన్ని చూపించారు. శిశువులు దేని వైపు ఎక్కువసేపు చూస్తున్నారో పరిశోధకులు గమనించారు. లింగంతో సంబంధం లేకుండా.. సాధారణంగా నవజాత శిశువులు వస్తువుల కంటే మనిషి ముఖం వంటి సామాజిక దృశ్యాల వైపే ఎక్కువ ఆసక్తి చూపినట్లు అధ్యయనం వెల్లడించింది. అయితే సగటున ఆడ శిశువులు మగ శిశువులతో పోలిస్తే ముఖాన్ని చూసే సమయాన్ని ఎక్కువగా కేటాయించినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ఫలితాలు Biology of Sex Differences అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

పుట్టిన కొన్ని గంటల్లోనే ఈ తేడాకు కారణం?

పుట్టిన కొన్ని గంటల్లోనే ఈ తేడా కనిపించడం పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది. శిశువులు పుట్టిన తర్వాత సామాజిక అనుభవాలు, పెంపకం, పరిసరాల ప్రభావం పెద్దగా మొదలయ్యే ముందే ఈ తేడా కనిపించిందని వారు చెబుతున్నారు. అందువల్ల గర్భంలోనే ఏర్పడే జీవశాస్త్ర సంబంధమైన అంశాలు దీనికి కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో హార్మోన్ల స్థాయిలు, జన్యుపరమైన అంశాలు ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.

2000లోనూ ఇదే ఫలితం

ఆశ్చర్యకరంగా.. ఇదే పరిశోధకుల బృందం 2000లో నిర్వహించిన అధ్యయనంలోనూ ఇలాంటి ఫలితాలనే వెల్లడించింది. అప్పుడు పుట్టిన వెంటనే ఆడ శిశువులు సగటున ముఖాలను ఎక్కువసేపు చూడగా.. మగ శిశువులు వస్తువుల వైపు ఎక్కువసేపు చూసినట్లు పరిశోధకులు తెలిపారు. అయితే ఆ అధ్యయనాన్ని మళ్లీ పరిశీలించి నిర్ధారించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు సూచించారు. నవజాత శిశువులపై ఇలాంటి పరిశోధనలు నిర్వహించడం చాలా కష్టంగా ఉండటంతో.. ఇన్నేళ్లుగా దీనిపై పునరావృత అధ్యయనం జరగలేదని పరిశోధకులు తెలిపారు.

దీని అర్థం ఇదేనా?

అయితే ఈ తేడాలు పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తాయని భావించకూడదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీకి చెందిన అలెక్స్‌ ట్సోంపానిడిస్‌ ప్రకారం.. పుట్టుకతోనే కనిపించే లింగ ఆధారిత తేడాలు పిల్లల అభివృద్ధికి ఒక ప్రారంభ బిందువు మాత్రమే. పిల్లలు పెరుగుతున్న కొద్దీ జీవశాస్త్రం, సామాజిక వాతావరణం రెండూ పరస్పరం ప్రభావం చూపుతాయి. అంటే.. పుట్టుకతో వచ్చే లక్షణాలు మాత్రమే పిల్లల అభివృద్ధిని నిర్ణయించవు.

‘నేచర్‌ వర్సెస్‌ నర్చర్‌’ చర్చకు మరో ఆధారం

మనిషి ప్రవర్తన, ఆలోచనా విధానాల్లో జన్యువుల ప్రభావం ఎంత? పెరిగే వాతావరణం ప్రభావం ఎంత? అనే ప్రశ్నపై ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతోంది. దీనినే ‘నేచర్‌ వర్సెస్‌ నర్చర్‌’ అని పిలుస్తారు. ఈ అధ్యయనం ఆ చర్చకు మరో కోణాన్ని అందిస్తోంది. పరిశోధకుల ప్రకారం.. పుట్టిన కొన్ని గంటల్లోనే తేడాలు కనిపించడం వల్ల గర్భంలోనే ప్రభావం చూపే జన్యువులు లేదా సెక్స్‌ హార్మోన్లు కొంత పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే ఆ తర్వాత పిల్లలు పెరిగే వాతావరణం వారి అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది

Follow Us
పుట్టిన కొన్ని గంటల్లో తేడా.. ఆడ శిశువులు ముఖాలనే ఎక్కువగా చూస్తా
పుట్టిన కొన్ని గంటల్లో తేడా.. ఆడ శిశువులు ముఖాలనే ఎక్కువగా చూస్తా
పూజలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? ఇలాంటి గంట శుభప్రదమట!
పూజలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? ఇలాంటి గంట శుభప్రదమట!
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..