AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: ధంతేరస్ వేళ బంగారం ధరలపై బిగ్ న్యూస్.. ఒక్కరోజులోనే ఊహించని పరిణామం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ వారంలో ప్రారంభం నుంచే పుంజుకుంటున్న ధరలు.. ఇప్పుడు మరింతగా పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. అయితే దీనికి వివిధ కారణాలు కనిపిస్తున్నాయి. డాలర్ బలహీనపడుతుండటమే పసిడి ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Prices: ధంతేరస్ వేళ బంగారం ధరలపై బిగ్ న్యూస్.. ఒక్కరోజులోనే ఊహించని పరిణామం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Nov 06, 2026 | 6:42 AM

Share

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. ధంతేరస్ వేళ బిగ్ షాక్ తగిలింది. పండుగ వేళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ భారీ ఓటమి, క్రూడ్ ఆయిల్ ధరలు కుప్పకూలుతుండటం, స్టాక్ మార్కెట్లలో జోష్ క్రమంలో బంగారంలోకి కూడా ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతున్నాయి. దీంతో పాటు పండుగల కారణంగా బంగారం, వెండి ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. ఈ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ట్రంప్ ఓటమితో డాలర్ బలహీనపడుతోంది. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముంటుంది. ఇవన్నీ పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీపావళి నాటికి మరింత పెరిగే అవకాశాలున్నాయనే వార్తలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. నవంబర్ 6వ తేదీన దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

గోల్డ్ రేట్లు ఇవే..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,030 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,860గా ట్రేడవుతోంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,46,030గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,860 వద్ద ట్రేడవుతోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ1,46,180 పలుకుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,34,010కు లభిస్తోంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,030 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,860గా కొనసాగుతోంది.

బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,46,030 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,860గా కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,10,100 వద్ద కొనసాగుతోంది. నిన్ ఈ రేటు రూ.2,10,000 వద్ద స్థిరపడింది\

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,09,900 వద్ద ట్రేడవుతోంది

-చెన్నైలో కిలో సిల్వర్ ధర రూ.2,09,900 పలుకుతోంది

-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,09,900కే లభిస్తోంది

-బంగారంతో పోలిస్తే వెండి ధరలు కాస్త భిన్నంగా ఉన్నాయి. సిల్వర్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. బంగారంతో పోలిస్తే వెండికి పారిశ్రామికపరంగా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్, విద్యుత్ రంగం, డేటా సెంటర్లలో వెండి ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా పరిణామాలకు వెండి వేగంగా స్పందిస్తూ ఉంటుంది.

Follow Us
ధంతేరస్ వేళ పసిడి ధరలు పైపైకి.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..
ధంతేరస్ వేళ పసిడి ధరలు పైపైకి.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..
కమెడియన్స్‌లో ఆయనంటే నాకు చాలా ఇష్టం..
కమెడియన్స్‌లో ఆయనంటే నాకు చాలా ఇష్టం..
స్నేహం పేరుతో మోసం.. మొసలి – కోతి కథ నేర్పిన జీవిత పాఠం
స్నేహం పేరుతో మోసం.. మొసలి – కోతి కథ నేర్పిన జీవిత పాఠం
నవంబర్ 6 రాశిఫలాలు: వీరికి ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో గుడ్‌న్యూస్
నవంబర్ 6 రాశిఫలాలు: వీరికి ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో గుడ్‌న్యూస్
ముందే తెలిస్తే మహేష్‌ను ఆ సినిమా చెయ్యొద్దని చెప్పేవాడిని..
ముందే తెలిస్తే మహేష్‌ను ఆ సినిమా చెయ్యొద్దని చెప్పేవాడిని..
పల్లె సంగతేంటి.. గ్రామీణ ఓటరు పోటెత్తాడా.. రూరల్ పల్స్ ఎటువైపు..?
పల్లె సంగతేంటి.. గ్రామీణ ఓటరు పోటెత్తాడా.. రూరల్ పల్స్ ఎటువైపు..?
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..!
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..!
ఒకే వేదికపై జగన్, కేటీఆర్, విజయ్, త్రిష.. నెట్టింట వైరల్ అవుతున్న
ఒకే వేదికపై జగన్, కేటీఆర్, విజయ్, త్రిష.. నెట్టింట వైరల్ అవుతున్న
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!
కొబ్బరి పీచుతో నేచురల్ హెయిర్ డై.. తెల్ల జుట్టును సహజంగా నల్లగా!
కొబ్బరి పీచుతో నేచురల్ హెయిర్ డై.. తెల్ల జుట్టును సహజంగా నల్లగా!