AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Prices: వాహనదారులకు త్వరలో ఊరట.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్..!

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు త్వరగా తగ్గుతాయా.. సామాన్యులకు భారీ ఊరట కలగనుందా.. అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమవుతున్నాయి. మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ ఓటమితో ముడి చమురు ధరలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

Venkatrao Lella
|

Updated on: Nov 05, 2026 | 1:55 PM

Share
అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ భారీ ఓటమిని మూటకట్టుకుంది. దీంతో అమెరికా, భారత స్టాక్ మార్కెట్లు జోష్‌లో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా కుప్పకూలుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 4.7 శాతం తగ్గడంతో ప్రస్తుతం బ్యారెల్‌కు 98.76 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డబ్ల్యూటీఐ 91.73 శాతానికి చేరుకుంది.

1 / 5
ట్రంప్ ఓటమితో ఇరాన్‌తో యుద్దం ముగస్తుందనే అంచనాలు, మధ్యప్రాచ్యం నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరా మరింత పెరగనుందనే సూచనలతో ధరలు దిగొస్తున్నాయి. ఈ కారణంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎక్కువకాలం పాటు ముడి చమురు ధరలు తగ్గడం వల్ల దేశంలో ఇంధన ధరలు తగ్గే అవకాశముందని నిపుణులు ఆశిస్తున్నారు. ఇదే జరిగితే సామాన్యులకు ఊరటగా చెప్పవచ్చు.

2 / 5
అక్టోబర్ తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్ల కంటే దిగువకు రావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ముడి చమురు ధరల్లో స్ధిరత్వం లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరల తగ్గింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజా ఓటమితో ఇరాన్‌తో యుద్దం ముగించుకోవాలని ట్రంప్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశముంది. ఇరాన్‌తో యుద్దమే తమ ఓటమికి కారణమని ట్రంప్ కూడా ప్రకటించిన క్రమంలో శాంతి ఒప్పందం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

3 / 5
ఉభయ సభల్లో డెమోక్రటిక్ పార్టీకి మెజార్టీ వస్తే ఇరాన్‌తో యుద్దం ముగిసే అవకాశాలున్నాయని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ముడి చమురు ఎగుమతులు పెరుగుతుండటం, ఇరాన్‌పై యుద్దంకు సంబంధించి తక్షణ ప్రణాళికలు లేవని ట్రంప్ చేసిన ప్రకటన కాస్త ఊరట కలిగిస్తోంది. అక్టోబర్‌లో గల్ప్ దేశాల నుంచి ముడి చమురు కండెన్సేట్, శుద్ది చేసిన ఉత్పత్తుల సగటు ఎగుమతులు రోజుకు 17.1 మిలియన్ బ్యారెళ్లుగా నమోదయ్యాయి.

4 / 5
అంతేకాకుండా హర్ముజ్ జలసంధిపై ఆధారపడకుండా.. సొంత పైప్‌లైన్‌ను నిర్మించుకోవాలని అరబ్ దేశాలు భావిస్తున్నాయి. దీని వల్ల ముడి చమురు సరఫరా మరింత పెరిగితే దేశంలో ధరలు తగ్గవచ్చు. భారతదేశం విదేశాల నుంచి ఎక్కువగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. ముడి చమురు ధరలు తగ్గడం వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. కానీ దేశంలోని ఇంధన ధరలు కేవలం ముడి చమురు ధరలపై ఆధారపడి ఉండవని నిపుణులు చెబుతున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ, చమురు కంపెనీల లాభాలు, శుద్ది ఖర్చులు, ప్రభుత్వం విధించే ట్యాక్సులపై ఆధారపడి ఉంటుంది.

5 / 5
Follow Us