AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amul Price Hike: దీపావళికి ముందే సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన వెన్న, నెయ్యి ధరలు.. తక్షణమే అమల్లోకి..

దీపావళి వేళ సామాన్యులకు షాక్ తగిలింది. ఈ ఏడాదిలో ఇప్పటికే పాల ధరలను పెంచి అమూల్ సంస్థ.. తాజాగా వెన్న, నెయ్యి ధరలను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ ధరలను అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించింది. దీపావళికి ముందే ధరలను పెంచడం గమనార్హం.

Amul Price Hike: దీపావళికి ముందే సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన వెన్న, నెయ్యి ధరలు.. తక్షణమే అమల్లోకి..
Amul
Venkatrao Lella
|

Updated on: Nov 05, 2026 | 12:36 PM

Share

దీపావళికి ముందే దేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు షాక్ తగిలింది. ప్రముఖ డెయిరీ ఉత్పత్తుల సంస్థ నెయ్యి, వెన్న ధరలను పెంచింది. దేశవ్యాప్తంగా కొత్త ధరలను ఇప్పటినుంచే అమల్లోకి తీసుకొచ్చింది. అన్నీ రిటైల్ అవుట్‌లెట్లతో పాటు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లలో కొత్త ధరలను తక్షణమే అప్డేట్ చేశారు. ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికే ఉత్పత్తి లేబుళ్లను అప్డేట్ చేశారు. దీపావళి సందర్భంగా స్వీట్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ ఉంటారు. స్వీట్ల తయారీలో నెయ్యి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు అమూల్ తీసుకున్న నిర్ణయతో స్వీట్ల ధరలు పెరగనున్నాయి.

కొత్త ధరలు ఇవే..

కేజీ నెయ్యి కార్టన్ ధర రూ.50 పెంచగా.. 500 గ్రాముల వెన్న ప్యాక్ ధర రూ.15 పెరిగింది. దీంతో పెరిగిన ధరలతో కేజీ నెయ్యి కార్టన్ ధర రూ.630 నుంచి రూ.680కి చేరుకుంది. ఇక 500 గ్రామలు స్వచ్చమైన నెయ్యి పౌచ్ ధర రూ.325 నుంచి రూ.345కి పెరిగింది. ఇక 100 గ్రాముల వెన్న క్యాక్ ధర రూ.63 నుంచి రూ.66కి పెరగ్గా.. 500 గ్రామలు ప్యాక్ ధర రూ.310 నుంచి రూ.325కి పెంచినట్లు అమూల్ సంస్థ తెలిపింది. నెయ్యి, వెన్న కొనుగోలు చేసేవారిపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. పండుగ సమయంలో వివిధ రకాల వంటల్లో నెయ్యి, వెన్న ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు వీటి ధరలు పెరగడం సామాన్యులకు చేదువార్తగా చెప్పవచ్చు. పశువుల మేత, ప్యాకేజింగ్ ఖర్చు, ఇంధన ఖర్చుల ధరలు పెరగడమే వీటి ధరలు పెంచడానికి కారణమని అమూల్ చెబుతోంది.

పెరిగిన పాల ధరలు

ఇప్పటికే అమూల్ పాల ధరలను పెంచింది. ఈ ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా పాల ప్యాకెట్ల ధరలను పెంచింది. లీటర్‌పై రూ.2 చొప్పున పెంచింది. మే 14వ తేదీ నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చేశాయి. తాజా, గోల్డ్, శక్తి, ఆవు పాలు ధరలను పెంచింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. పశువుల మేత, ప్యాకేజింగ్, ఇంధన ఖర్చులు పెరగడం వల్ల ధరలను పెంచుతున్నట్లు చెబుతోంది. ఇక పాల రైతులకు చెల్లించే సేవకరణ ధరల్లో కూడా మార్పుల చేసింది. లీటర్‌కు 2.5 శాతం నుంచి 3.50 శాతానికి పెంచింది. అటు ఎల్‌నివో ప్రభావం కూడా పాల ఉత్పత్తుల ధరలు పెరగడానికి కారణంగా చెబుతోంది. దేశవ్యాప్తంగా ఎల్‌నివో ప్రభావం వర్షాలు లేకపోవడంతో మేతకు కొరత ఏర్పడుతుంది. ఈ కారణంతో మేత కోసం డెయిరీ కంపెనీలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు వల్ల రవాణా ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఇవి డెయిరీ ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నాయి.

Follow Us