AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌పై స్పష్టమైన వ్యతిరేకత.. ఊపందుకున్న స్టాక్ మార్కెట్లు.. ఈ షేర్లలో భారీ ర్యాలీ

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు భారీ విజయం సొంతం చేసుకున్నారు. రిపబ్లికన్లకు కంచుకోటల్లాంటి స్థానాల్లోనూ డెమొక్రాట్లు గెలుపొందారు. దీంతో వాల్‌స్ట్రీట్‌ ట్రేడింగ్‌ లాభాలతో ముగిసింది. డెమొక్రాట్ల మద్దతు కొనసాగుతుందన్న అంచనాలతో సోలార్‌ షేర్లలో ర్యాలీతో కొనసాగాయి.

ట్రంప్‌పై స్పష్టమైన వ్యతిరేకత.. ఊపందుకున్న స్టాక్ మార్కెట్లు.. ఈ షేర్లలో భారీ ర్యాలీ
Trump Wall Street Trading
Venkatrao Lella
|

Updated on: Nov 05, 2026 | 8:29 AM

Share

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు ఘన విజయం సాధించారు. సెనేట్‌, ప్రతినిధుల సభ రెండింటినీ డెమొక్రాట్లు కైవసం చేసుకున్నారు. ట్రంప్‌ ప్రభుత్వంపై ఓటర్ల వ్యతిరేకతతో రిపబ్లికన్ల కంచుకోటల్లోనూ డెమొక్రాట్లకు విజయాలు సాధించారు. ఎన్నికల ఫలితాలతో రాజకీయ అనిశ్చితి తగ్గిందన్న అంచనాలతో స్టాక్‌ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింది. భారీ లాభాలతో వాల్‌స్ట్రీట్‌ ట్రేడింగ్‌ ముగిసింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.6 శాతం పెరిగి 7,688.62 పాయింట్లకు చేరింది. నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 1.4 శాతం లాభపడి 25,736.51 పాయింట్ల వద్ద ముగిచింది. డౌజోన్స్‌ ఏకంగా 3 శాతం పెరిగి 53,356.12 పాయింట్లకు చేరింది.

ఏఐ దిగ్గజ కంపెనీల షేర్లలో భారీ లాభాలు కనిపించాయి. మైక్రోసాఫ్ట్‌ 6.7 శాతం, అమెజాన్‌ 6.1 శాతం, ఆల్ఫాబెట్‌ 3.2 శాతం, మెటా 1.4 శాతం పెరుగుదల నమోదు చేసింది. డేటా సెంటర్ల విస్తరణపై ఆంక్షలు రావచ్చన్న అంచనాలతో డేటా సెంటర్‌ కంపెనీల షేర్ల పతనమయ్యాయి. హట్‌ 8 షేర్లు 23 శాతం, ఐరెన్‌ 11 శాతం, కోర్‌ సైంటిఫిక్‌ 10 శాతం, అప్లైడ్‌ డిజిటల్‌ 6.7 శాతం నష్టపోయింది. చిప్‌ తయారీ కంపెనీల షేర్లలోనూ ఒత్తిడి కొనసాగింది. ఫిలడెల్ఫియా సెమీకండక్టర్‌ సూచీ 3.1 శాతం పతనమైంది. డేటా సెంటర్ల నిర్మాణ వేగం తగ్గితే ఏఐ మౌలిక సదుపాయాల సరఫరాదారుల వ్యాపారంపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇరాన్‌ యుద్ధం ముగింపుపై ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా తగ్గడం అమెరికా మార్కెట్లకు కలిసొచ్చిన పరిణామంగా చెప్పవచ్చు.

క్లీన్‌ ఎనర్జీ రంగానికి డెమొక్రాట్ల మద్దతు కొనసాగుతుందన్న అంచనాలతో సోలార్‌ షేర్లలో ర్యాలీ కనిపించింది. ఇన్వెస్కో సోలార్‌ ఈటీఎఫ్‌ దాదాపు 6 శాతం లాభం పడగా.. ట్రంప్‌ ప్రతిపాదించిన 1.5 ట్రిలియన్‌ డాలర్ల రక్షణ బడ్జెట్‌కు కాంగ్రెస్‌లో అడ్డంకులు ఎదురుకావచ్చన్న అంచనాలతో రక్షణ రంగ షేర్లలో నష్టాలు చోటుచేసుకున్నాయి.

Follow Us