EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్..! కేంద్రం నుంచి బిగ్ న్యూస్.. రెడీగా ఉండండి..
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు దీపావళి తర్వాత శుభవార్త అందనుందా..? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నెలలో ఈపీఎఫ్ఓ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పెన్షన్ పరిమితిపై అధికారులు చర్చించనున్నారు, అనంతరం సానుకూల నిర్ణయం వెలువడవచ్చని ఉద్యోగులు ఆశిస్తున్నారు.

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి త్వరలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుందని తెలుస్తోంది. దీపావళి తర్వాత పెన్షన్ పెంపుపై కీలక నిర్ణయం వెలువడవచ్చని చెబుతున్నారు. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఎంప్లాయిస్ పెన్షన్ పథకం కింద ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.వెయ్యిగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇదే పరిమితి కొనసాగుతోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, ఖర్చులు తారాస్థాయికి చేరుకున్న క్రమంలో పెన్షన్ పెంచాలని ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖకు పలుమార్లు వినతిపత్రాలు కూడా అందించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పెన్షన్ పరిమితిపై కూడా సానుకూల నిర్ణయం త్వరలో తీసుకొవచ్చని తెలుస్తోంది.
పెన్షన్ రూ.7,500కి పెంపు..?
ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ పరిమితి ప్రస్తుతం రూ.వెయ్యిగా ఉంది. దీనిని రూ.7,500కి పెంచుతారనే వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి భారీ శుభవార్తగా చెప్పవచ్చు. పెన్షన్ అమౌంట్ అనేది పెరుగుతుంది. దీని వల్ల ఎక్కువ డబ్బులు పొదుపు అవుతాయి. ఈ ఏడాది నవంబర్ 19వ తేదీన గుజరాత్‌లోని గిర్‌లో ఈపీఎఫ్ఓ 240వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో నెలవారీ పెన్షన్‌ను రూ.వెయ్యి నుంచి రూ.7,500కు పెంచే ప్రతిపాదనపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పెన్షన్ పరిమితి పెంచాలనేని ఉద్యోగులు, పెన్షన్‌దారుల చిరకాల డిమాండ్‌గా చెప్పవచ్చు. దీంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ డిమాండ్‌పై సానుకూల నిర్ణయం ఉండొచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు.
పెన్షన్ ఎలా లెక్కిస్తారు..?
ప్రస్తుతం కనీస పెన్షన్ లిమిట్ రూ.వెయ్యిగా ఉంది. ఉద్యోగి పెన్షన్ రూ.వెయ్యి కంటే తక్కువగా ఉంటే.. కేంద్రం తన వంతు సహకారం అందిస్తుంది. నెలవారీ ఈపీఎస్ పింఛన్=పించన్‌కు అర్హత గల జీతం× పింఛనుకు అర్హత గల సర్వీసు) ÷ 70 ప్రకారం లెక్కిస్తారు. ఉద్యోగి సర్వీస్ కాలం పదేళ్లు పూర్తయితే 60 ఏళ్ల తర్వాత ప్రతీ నెలా పెన్షన్ రూపంలో అందిస్తారు. 10 ఏళ్ల సర్వీస్ పీరియడ్ పూర్తి చేయకపోతే ఉద్యోగం మానేసిన తర్వాత పెన్షన్‌ను ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు, చివరి 60 నెలల్లో పొందిన సగటు నెలవారీ జీతమే పింఛనుకు అర్హత గల జీతంగా కొనసాగుతుంది. బేసిక్ శాలరీ, కరువు భత్యం (DA) రూ. 50 వేలు ఉన్నప్పటికీ..యజమాని EPS ఖాతాకు గరిష్టంగా రూ. 25 వేలు(8.33 శాతం) వరకు మాత్రమే జమ చేస్తారు.
