Jailer 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న జైలర్ 2.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జైలర్ 2'. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను నమోదు చేసిన ఈ సినిమా, థియేటర్లలో దుమ్మురేపుతుంది. దసరా కానుకగా అక్టోబరు 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. రజనీకాంత్ స్టైలిష్ మేకింగ్, నెల్సన్ టేకింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు థియేట్రికల్ రన్ ముగింపు దశకు చేరుకోగా, ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

సౌత్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా జైలర్ 2. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటివరకు రూ.800 కోట్లకుపైగా వసూల్లు రాబట్టి సరికొత్త రికార్డులు తిరగరాసింది. ఇందులో రజినీ స్వాగ్, స్టైల్, యాక్టింగ్ అలాగే అనిరుధ్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పాలి. 75 ఏళ్ల వయసులోనూ థియేటర్లలో తన నటనతో సెన్సేషన్ క్రియేట్ చేశారు రజినీ. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఇక ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించిన వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, ‘జైలర్ 2’ సినిమా విడుదలైన నెలరోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్కు రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
నవంబరు 12వ తేదీ నుంచి ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది అమెజాన్ ప్రైమ్. “టైగర్ ముత్తువేల్ పాండియన్ తిరిగి వస్తున్నాడు. రీలోడెడ్ నవంబరు 12న అమెజాన్ ప్రైమ్‌లో..” అంటూ ప్రైమ్ వీడియో అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, విద్యా బాలన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్ వంటి దిగ్గజ నటులతో పాటు స్టార్ హీరో హృతిక్ రోషన్ అతిథి పాత్రల్లో మెరిసి సినిమా స్థాయిని మరింత పెంచారు. భారీ తారాగణం, అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. థియేటర్లలో రికార్డులు తిరగరాసిన ఈ యాక్షన్ ఎపిక్ ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
అమెజాన్ ప్రైమ్ వీడియో..
TIGER MUTHUVEL PANDIAN is back. RELOADED 🔥
#Jailer2OnPrime, Nov 12
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @vidya_balan @sunpictures @iam_SJSuryah #MithunChakraborty #SurajVenjaramoodu @meramyakrishnan @iYogiBabu https://t.co/AgpP66EEwT
— prime video IN (@PrimeVideoIN) November 5, 2026
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
