- Telugu News Photo Gallery Eating kiwi fruit can reduce dengue virus, check here is details in Telugu
Kiwi check Dengue Virus: కివీ ఫ్రూట్స్ తో డెంగ్యూ వైరస్ కి చెక్ పెట్టండిలా..
కాలం ఏదైనా.. దోమల బెడద మాత్రం కామన్ గా ఉంటుంది. ఈ దోమల కారణంగా అనేక భయంకరమైన వ్యాధులు సోకుతున్నాయి. దోమల సంక్రమణ కారణంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి డేంజరస్ వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా ఎడిస్ ఈజిప్టి అనే దోమ కుట్టడం వల్ల.. డెంగ్యూ బారిన పడుతున్నారు. ఈ డెంగ్యూ దోమలు సాధారణంగా పగటి పూట మాత్రమే కుడుతూ ఉంటాయి. కాబట్టి ఈ దోమలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ సోకిందంటే ముఖ్యంగా ప్లేట్ లెట్స్ కౌంట్ అనేది పడి పోతుంది. అంతే కాకుండా అధిక రక్త స్రావం..
Updated on: Nov 25, 2023 | 1:26 PM

Kiwi: కివీ పండులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో కివీ పండ్లను చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

డెంగ్యూ సోకిందంటే ముఖ్యంగా ప్లేట్ లెట్స్ కౌంట్ అనేది పడి పోతుంది. అంతే కాకుండా అధిక రక్త స్రావం కూడా అవుతుంది. డెంగ్యూ సోకిన వారు తప్పకుండా ఆహారంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. డెంగ్యూతో బాధ పడేవారు కివీ పండ్లను కనుక ఆహారంలో తీసుకుంటే.. డెంగ్యూ తగ్గుతుందని ఇటీవల పలు అధ్యయనాల్లో తేలింది.

డెంగ్యూ బారిన పడిన వాళ్లు కివీ పండ్లను తీసుకోవడం వల్ల సరైన పోషకాలు అందుతాయి. పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఇ వంటివి సమృద్ధిగా అందుతాయి. కాబట్టి ఈ పండును తీసుకోవడం వల్ల డెంగ్యూ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

డెంగ్యూ రోగులకు జీర్ణ క్రియ అనేది మెల్లగా జరుగుతుంది. ఇలాంటి వారు కివీ ఫ్రూట్ ని తీసుకుంటే ఆ సమస్యల నుంచి బయట పడొచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణ క్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.

కివీ ఫ్రూట్ ని తీసుకోవడం వల్ల విటమిన్లు, ఇ, సిలు అందుతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ సమస్యల నుంచి కూడా కాపాడతాయి. అదే విధంగా రక్త పోటుతో బాధ పడే వారు సైతం కివీని తినడం వల్ల గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.




