AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virupaksha Movie Review: ‘విరూపాక్ష’ రివ్యూ.. సాయి ధరమ్ తేజ్ కమ్ బ్యాక్ సక్సెస్ అయ్యిందా ?..

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో విరూపాక్షపై ముందు నుంచే క్యూరియాసిటీ ఉంది. పైగా టీజర్, ట్రైలర్ అన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. అన్నింటికి తోడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం మరో అదనపు ఆకర్షణ. ఇక థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ కావడంతో విరూపాక్ష ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

Virupaksha Movie Review: 'విరూపాక్ష' రివ్యూ.. సాయి ధరమ్ తేజ్ కమ్ బ్యాక్ సక్సెస్ అయ్యిందా ?..
Virupaksha
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Rajitha Chanti|

Updated on: Apr 21, 2023 | 12:28 PM

Share

మూవీ రివ్యూ: విరూపాక్ష

నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, సునీల్, సోనియా సింగ్, రవికృష్ణ తదితరులు

సంగీత దర్శకుడు: అజనీష్ లోక్‌నాథ్

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రఫీ: శామ్‌దత్ సైనుద్దీన్

ఎడిటర్: నవీన్ నూలి

స్క్రీన్ ప్లే: సుకుమార్

దర్శకుడు : కార్తీక్ దండు

నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో విరూపాక్షపై ముందు నుంచే క్యూరియాసిటీ ఉంది. పైగా టీజర్, ట్రైలర్ అన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. అన్నింటికి తోడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం మరో అదనపు ఆకర్షణ. ఇక థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ కావడంతో విరూపాక్ష ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందా..? సాయి ధరమ్ తేజ్ కమ్ బ్యాక్ ఇచ్చాడా లేదా అనేది డీటైల్డ్ రివ్యూలో చూద్దాం..

కథ:

రుద్రవణం అనే ఊరు.. 1979 సంవత్సరం.. ఆ ఏడాది ఊళ్లో అనుకోని సంఘటన ఒకటి జరుగుతుంది. ఒక జంటను గ్రామస్థులు చేతబడి చేస్తున్నారనే నెపంతో సజీవ దహనం చేస్తారు. అలా జరిగిన పుష్కరం తర్వాత.. అంటే 1991లోకి ఆ ఊళ్ళోకి ఓ పని మీద సూర్య (సాయి ధరమ్ తేజ్) వస్తాడు. ఊరి అందాలతో పాటు.. సర్పంచ్ (రాజీవ్ కనకాల) కూతురు నందిని (సంయుక్త మీనన్)ను చూడగానే ఇష్టపడతాడు. అలా వాళ్ల ప్రేమకథ సాగుతుండగానే.. ఊళ్ళో వరస మరణాలు సంభవిస్తుంటాయి. దాంతో ఊరిని అష్టదిగ్భంధనం చేస్తారు. కానీ ఆ తర్వాతే మరణాల సంఖ్య పెరుగుతుంది. అమ్మవారు ఉన్న ఊళ్ళోకి దుష్ట శక్తులు ఎలా వచ్చాయి.. వచ్చిన వాటిని హీరో ఎలా అడ్డుకున్నాడు..? అసలు గ్రామస్థులు ఆ జంటను చంపడానికి కారణమేంటి అనేది అసలు కథ..

కథనం:

దెయ్యాలు, హార్రర్ కథలు గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది ట్విస్టుల గురించి.. ఒక్కటి బయటపెట్టినా కచ్చితంగా సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది. చూసే ఆసక్తి కూడా ఉండదు. విరూపాక్ష కూడా అలాంటి సస్పెన్స్ హార్రర్ డ్రామానే. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఈ సినిమా వచ్చింది. ఎప్పటికీ బోర్ కొట్టని ఎవర్ గ్రీన్ హిట్ ఫార్ములా దెయ్యాల కథలు.. ఓ ఆత్మను ఊరి మీదకి వదిలి పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకుంటే పక్కా హిట్ అని చాలా సినిమాలు నిరూపించాయి. ఇదే ఫార్ములా విరూపాక్షకు కూడా వర్కౌట్ అయింది. ఎన్నో సినిమాల్లో చూసిన ఒక ‘ఆత్మ’కథ ఇది. తెలిసిన కథే అయినా.. ఆసక్తికరమైన కథనం.. అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్ తో స్పెషల్ గా మారింది విరూపాక్ష. టెక్నికల్ గా చాలా సౌండింగ్ గా ఉంది ఈ సినిమా. సినిమా మొదలవడమే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నెమ్మదిగా కథలోకి వెళుతున్న కొద్ది వరస మరణాలు క్యూరియాసిటీ పెంచేస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. ఫస్టాఫ్ లో ఎదురైన ప్రశ్నలకు.. సెకండాఫ్ సమాధానం ఇస్తుంది. ఎంత గ్రిప్పింగ్ గా అనిపించినా.. ఈ కథలోనూ కొన్ని లోపాలు కనిపిస్తాయి. కానీ సుకుమార్ స్క్రీన్ ప్లే వాటిని కవర్ చేసింది. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించడం కష్టం. అదే సినిమాకు ప్లస్ కూడా. పైగా చివరి 30 నిమిషాలు అలా కూర్చోబెట్టేస్తుంది సినిమా. ట్విస్టులు చెప్పకూడదు కాబట్టి రివ్యూలో ఇంతకుమించి డీటైలింగ్‌గా వెళ్లడం కష్టమే.

నటీనటులు:

సాయి ధరమ్ తేజ్ కు కమ్ బ్యాక్ సినిమా ఇది.. సూర్య పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. తన పాత్రకు న్యాయం చేసాడు. నటనలోనూ మెచ్యూర్డ్‌గా కనిపించాడు. సంయుక్త మీనన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. ఆమె పాత్రను అస్సలు ఊహించలేరు. ఇక సునీల్ కారెక్టర్ అసంపూర్తిగా అనిపించింది. రాజీవ్ కనకాల, సాయి చంద్, అజయ్ పాత్రలు బాగున్నాయి. సోనియా సింగ్, శ్యామల బాగా నటించారు. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నికల్ టీం:

విరూపాక్ష పూర్తిగా టెక్నికల్ సినిమా. వాళ్లకు పెద్దపీట వేయాల్సిన సినిమా. ముఖ్యంగా కాంతార ఫేమ్ అజినీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అదిరిపోయింది. పాటలు అంతగా ఆకట్టుకోలేదు కానీ సౌండ్స్ మాత్రం అదిరిపోయాయి. శామ్ దత్ సైనూద్ధీన్ సినిమాటోగ్రఫీ పీక్స్ అంతే. ఇక ఎడిటింగ్ చాలా బాగుంది. కథ పరంగా దర్శకుడు రొటీన్ రాసుకున్నా.. సుకుమార్ స్క్రీన్ ప్లే మాత్రం మామూలుగా లేదు. ఏ చిన్న ట్విస్ట్ రివీల్ చేసినా.. సినిమా మొత్తంపై ఎఫెక్ట్ పడుతుంది. ఇటుకపై ఇటుక పేర్చినట్లుగా ఈ కథనం ఉంటుంది. దర్శకుడిగా కార్తిక్ దండు తొలి సినిమాతోనే సత్తా చూపించాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా విరూపాక్ష.. కొన్ని లోపాలున్నా.. హార్రర్ సినిమా లవర్స్‌కు బెస్ట్ ఛాయిస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.