Mammootty: సినీ ఇండస్ట్రీలో విషాదం.. మెగాస్టార్‌ మమ్ముట్టికి మాతృవియోగం.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

మలయాళీ అయినా మమ్ముట్టికి తెలుగు నాట మంచి ఫాలోయింగ్‌ ఉంది. స్వాతికిరణం, సూర్య పుత్రులు, దళపతి తదితర సినిమాలతో ఆయనకు టాలీవుడ్‌ ప్రేక్షకులతో మంచి అనుభందం ఏర్పడింది. అలాగే దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన యాత్రలో లీడ్‌ రోల్‌ పోషించారు. ప్రస్తుతం అఖిల్‌ హీరోగా నటిస్తోన్న ఏజెంట్ మూవీలోనూ కీ రోల్‌ పోషించాడు.

Mammootty: సినీ ఇండస్ట్రీలో విషాదం.. మెగాస్టార్‌ మమ్ముట్టికి మాతృవియోగం.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
Mammootty Mother
Follow us
Basha Shek

|

Updated on: Apr 21, 2023 | 12:36 PM

మలయాళ సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మెగాస్టార్‌ మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) ఇవాళ (ఏప్రిల్‌21) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫాతిమా మరణంతో మమ్ముట్టి ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. కొచ్చిలోని చెంబు ప్రాంతానికి చెందిన ఫాతిమా తన సోదరసోదరిమణులతో కలిసి నివసిస్తోంది. ఆమె అంతిమ సంస్కారాలను చెంబులోని మసీదులోనే నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇవాళ సాయంత్రమే అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మ‌మ్ముట్టి త‌ల్లి మ‌ర‌ణంతో మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లో తీవ్ర విషాదం అలుముకుంది. పలువురు సినీ నటులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మలయాళీ అయినా మమ్ముట్టికి తెలుగు నాట మంచి ఫాలోయింగ్‌ ఉంది. స్వాతికిరణం, సూర్య పుత్రులు, దళపతి తదితర సినిమాలతో ఆయనకు టాలీవుడ్‌ ప్రేక్షకులతో మంచి అనుభందం ఏర్పడింది. అలాగే దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన యాత్రలో లీడ్‌ రోల్‌ పోషించారు. ప్రస్తుతం అఖిల్‌ హీరోగా నటిస్తోన్న ఏజెంట్ మూవీలోనూ కీ రోల్‌ పోషించాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.

అమ్మ లేని లోటు పూడ్చలేనిది: ఎంపీ శశిథూర్

ఇక మమ్ముట్టి కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దుల్కర్‌ గతేడాది ‘సీతారామం’తో సూపర్‌హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. కాగా మమ్ముట్టి తల్లి మరణంపై తిరువనంతపురం ఎంపీ శశిథూరూర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ‘ ఈరోజు ఉదయమే మమ్ముట్టితో మాట్లాడాను. ఆయన తల్లిగారి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అమ్మలేని లోటు పూడ్చలేనిది. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకునేలా మమ్ముట్టికి ధైర్యాన్ని అందించాలని కోరుతున్నాను’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు శశిథరూర్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో