Malli Pelli Teaser: ‘మళ్లీ పెళ్లి’ టీజర్ విడుదల.. నరేశ్.. పవిత్రల జీవితమే సినిమానా ?..
నరేష్.. పవిత్ర జంటగా నటిస్తున్న ఈ మూవీకి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతోపాటు.. కన్నడలోనూ ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే.. నరేష్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలే వెండితెరపై చూపించబోతున్నారు. అంటే నరేష్ తన జీవిత కథనే సినిమాగా తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది.
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్.. పవిత్రా లోకేష్.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో సెన్సెషన్ సృష్టించిన పేర్లు. వీరిద్దరి ప్రేమాయణం.. పెళ్లి గురించి ఫిల్మ్ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. అదే సమయంలో తామిద్దరం కొత్త జీవితం ప్రారంభించబోతున్నామంటూ నూతన సంవత్సరం రోజు వీడియో రిలీజ్ చేస్తూ తమ ప్రేమను వ్యక్తం చేశారు. దీంతో వారి పెళ్లి నిజమే అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకు తమ పెళ్లి జరిగినట్లుగా ఓ వీడియో షేర్ చేస్తూ అందరికీ షాకిచ్చారు. అయితే అది నిజమైన వివాహం కాదని.. సినిమా కోసం మ్యారెజ్ జరిగిందని కొందరు కామెంట్స్ చేయగా.. మరికొందరు మాత్రం పవిత్ర, నరేష్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఆ తర్వాత అంతా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆ వీడియో.. పెళ్లి అంతా తమ నెక్ట్స్ సినిమా కోసమే చేశారని తెలిసింది. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ చేస్తున్నామంటూ.. టైటిల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నరేష్.. పవిత్రా కలిసి నటిస్తోన్న ఈ సినిమాకు ‘మళ్లీ పెళ్లి’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు.
నరేష్.. పవిత్ర జంటగా నటిస్తున్న ఈ మూవీకి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతోపాటు.. కన్నడలోనూ ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే.. నరేష్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలే వెండితెరపై చూపించబోతున్నారు. అంటే నరేష్ తన జీవిత కథనే సినిమాగా తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో నరేష్ భార్యగా వనితా విజయ్ కుమార్ కనిపించారు. తాను మోసపోయానని వనితా మీడియా ముందు మాట్లాడుతుండడంతో టీజర్ ప్రారంభమైంది. అయితే అందులో తన భర్త మృగం అని చెప్పగా.. నరేష్.. పవిత్రా సంతోషంగా ఉండడం కనిపిస్తుంది. ఈ సినిమాను విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో జయసుధ, శరత్ బాబు, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ కీలకపాత్రలలో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి, అరుల్దేవ్ కలిసి సంగీతం అందించారు. అలాగే ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ..జునైద్ సిద్ధిక్ ఎడిటర్ గా వ్యవహరించగా.. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఈ సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.