Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Setupathi: హీరోగా కొడుకు ఎంట్రీ.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి.. ఎందుకంటే..

విజయ్ సేతుపతి పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు. కంటెంట్ నచ్చితే విలన్ పాత్రలతోనూ అదరగొట్టేస్తుంటారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన ఆయన.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా తన కొడుకు కారణంగా క్షమాపణలు చెప్పారు. అసలేం జరిగిందంటే..

Vijay Setupathi: హీరోగా కొడుకు ఎంట్రీ.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి.. ఎందుకంటే..
Vijay Sethupathi, Surya
Rajitha Chanti
|

Updated on: Jul 06, 2025 | 6:43 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇన్నాళ్లు ప్రధాన నటుడిగా వెండితెరపై సందడి చేసిన సేతుపతి.. ఇప్పుడు కంటెంట్ నచ్చితే విలన్ పాత్రలతోనూ మెప్పిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో పలు సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా తన కొడుకు కారణంగా అభిమానులను క్షమాపణలు చెప్పారు విజయ్. ఇటీవల తన కొడుకు సూర్యకు సంబంధించిన వైరల్ వీడియో వివాదంపై విజయ్ సేతుపతి స్పందించారు. తన కొడుకు చేసిన పనికి ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని అన్నారు. అసలు ఏం జరిగిందంటే..

విజయ్ సేతుపతి తనయుడు సూర్య హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆయన నటించిన తొలి చిత్రం ఫీనిక్స్ జూలై 4న అడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక తండ్రిలాగే అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు సూర్య. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీమియర్ షో ఇప్పుడు వివాదాస్పందంగా మారింది. సూర్యకు సంబంధించిన వీడియోస్ డిలీట్ చేయాలని అతడి టీమ్ మీడియాపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై విజయ్ సేతుపతి స్పందించారు.

‘సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు నిజంగా అలాంటి ఒత్తిడి తెచ్చి ఉంటే.. అది తెలియకుండా జరిగి ఉండవచ్చు. లేదా వేరొకరు చేసి ఉండవచ్చు.. ఈ విషయంలో ఎవరైనా బాధపడితే వారికి నా తరపున క్షమాపణలు చెబుతున్నాను’ అని విజయ్ సేతుపతి అన్నారు. సూర్య హీరోగా నటించిన ఫీనిక్స్ సినిమాలో దేవదర్శిని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషఇంచారు. ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహించగా.. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..