Tollywood: పాలతో స్నానం.. గులాబీ రేకులపై నిద్ర.. టాలీవుడ్ విలన్ లైఫ్ స్టైల్.. దెబ్బకు ఛాన్సులు గోవిందా..
సాధారణంగా సోషల్ మీడియాలో హీరోహీరోయిన్స్ లైఫ్ స్టైల్ గురించి తెగ చర్చ నడుస్తుంటుంది. నిత్యం సినీతారల పర్సనల్ విషయాలు, ఫిట్నెస్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ విలన్ లైఫ్ స్టైల్ గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు. పాలతో స్నాం.. గులాబీ రేకులపై నిద్ర కారణంగా అవకాశాలు కోల్పోయాడట. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. పవర్ ఫుల్ విలన్ పాత్ర అయినప్పటికీ తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తెలుగుతోపాటు హిందీలోనూ అనేక అవకాశాలు అందుకున్నాడు. కానీ తన లైఫ్ స్టైల్ కారణంగా సినిమాలో అవకాశం కోల్పోయినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అతడు మరెవరో కాదు.. రేసు గుర్రం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన నటుడు రవికిషన్. తనకున్న అసాధారణమైన అలవాట్ల గురించి గతంలో బయటపెట్టారు. పాలతో స్నానం.. గులాభీ రేకులపై నిద్రపోవడం.. వంటివి చేసేవాడినని అన్నారు. నటుడిగా ఇలాంటివి పాటించాలనే భ్రమలో ఉండేవాడినని అన్నారు. ఆ అలవాట్ల కారణంగా తాను ఓ సినిమాలు ఛాన్స్ కోల్పోయినట్లు తెలిపారు.
రవికిషన్ మాట్లాడుతూ..”ఒకప్పుడు నేను పాలతో స్నానం చేసి.. గులాబీ రేకులపై నిద్రపోయేవాడిని. ఎందుకంటే నటుడు అంటే ఇలాగే ఉండాలనే భావనలో ఉండేవాడిని. హాలీవుడ్ స్టార్స్ ఆల్ పాసినో, రాబర్ట్ డి నీరో వంటి స్టార్స్ సినిమాలు చూపిస్తూ.. స్టార్స్ అందరూ ఇలాగే జీవిస్తుంటారు.. నువ్వు కూడా అదే లైఫ్ స్టైల్ ఫాలో కావాలి అని చెప్పినప్పుడు మన మనసులో బలంగా నాటుకుపోతుంది. నా విషయంలోనూ అదే జరిగింది. ది గాడ్ ఫాదర్ సినిమాను 500 సార్లు చూపించారు. అందుకే ఎంతో శ్రమించి నటుడిగా మారాను. పాలతో స్నానం చేస్తే నా గురించి నలుగురు మాట్లాడుకుంటారని అనుకున్నాను. నా గురించి ప్రజలు మాట్లాడుకోవడానికి ఇలాంటి పనులు చేశాను. కానీ ఆ విషయం డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కు తెలియడంతో గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ లో అవకాశం ఇవ్వలేదు. నా డిమాండ్స్ తీర్చే అంతటి బడ్జెట్ లేదన్నారు. అలా నా లైఫ్ స్టైల్ కారణాంగా ఓ అవకాశాన్ని కోల్పోయాను” అంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి :
రవికిషన్ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యారు. అలాగే హిందీతోపాటు భోజ్ పురి, మరాటి, కన్నడ చిత్రాల్లో నటించారు. రేసుగుర్రం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. కిక్ 2, సుప్రీమ్, రాధ, లై, సాక్ష్యం, 90 ఎం.ఎల్, సైరా వంటి సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు.
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..