AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nora Fatehi: షాకింగ్.. స్టార్ హీరో, హీరోయిన్ల కార్లకు యాక్సిడెంట్లు.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

షాకింగ్.. స్టార్ హీరో, హీరోయిన్లు రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కార్లు శనివారం (డిసెంబర్ 20) రాత్రి ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయని తెలుస్తోంది. అలాగే ఈ ఘటనలపై పోలీసు కేసులు నమోదయ్యాయని సమాచారం.

Nora Fatehi: షాకింగ్.. స్టార్ హీరో, హీరోయిన్ల కార్లకు యాక్సిడెంట్లు.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?
Sivakarthikeyan, Nora Fatehi
Basha Shek
|

Updated on: Dec 21, 2025 | 8:23 AM

Share

బాహుబలి ఫేమ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నోరా ఫతేహి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. శనివారం (డిసెంబర్ 20) ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొట్టింది. గోవాలో జరిగే సన్​బర్న్ ఫెస్టివల్ కు నోరా వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వినయ్ సక్పాల్ (27) మద్యం సేవించి ఉన్నట్లు ముంబయి పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో నోరా ఫతేహికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వినయ్ సక్పాల్​ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్​ అండ్​ డ్రైవ్​ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతను మద్యం మత్తులో కారు నడిపాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం నోరా ముంబయిలో జరిగిన ఆ ఫెస్టివల్‌కు హాజరయ్యారు.

మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రయాణిస్తున్న కారుకు కూడా ప్రమాదం జరిగింది. శివ కార్తికేయన్ ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హీరోకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది. చెన్నైలోని కైలాశ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం సమయంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. హీరోను మరో వాహనంలో పంపించినట్లు తెలుస్తుంది. హీరో కారుని ఢీ కొట్టిన మరో కారు డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.. ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

హీరో శివ కార్తికేయన్ కారు యాక్సిడెంట్ విజువల్స్.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి