Maha Kumbh Mela: కాషాయ వస్త్రాలు ధరించి.. మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన టాలీవుడ్ క్రేజీ హీరో
మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివెళుతున్నారు. ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసుకుని మరీ ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ కు ప్రయాణిస్తున్నారు. ఇందులో సామాన్యుల తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరో మహా కుంభమేళాలో తళుక్కుమన్నాడు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కేవలం సామాన్యులే కాదు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా మహా కుంభమేళాలో భాగమవుతున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ప్రముఖులు పెద్ద ఎత్తున మహా కుంభమేళాలో తళుక్కుమంటున్నారు. ఇప్పటికే సంయుక్త మేనన్, యాంకర్ లాస్య, బింధుమాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ, బిగ్ బాస్ ప్రియాంక జైన్, దిగంగన సూర్య వంశీ, రాజ్ కుమార్ రావు తదితర సినీ ప్రముఖులు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు. తాజాగా టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవర కొండ మహా కుంభమేళాను దర్శించుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం (ఫిబ్రవరి 09) పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
విజయ్ దేవరకొండ కుంభమేళాలో పాల్గొనడానికి తన సినిమా షూటింగుల నుంచి కాస్త విరామం తీసుకున్నాడు. ఈ సందర్భంగా కుంభమేళాలో అతను కాషాయ వస్త్రాలు, రుద్రాక్ష మాల ధరించి కనిపించాడు. గతంలో హైదరాబాద్ విమానాశ్రయంలోనూ అతను కనిపించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
Vijay Deverakonda takes a holy dip with mother Madhavi at Sangam during Mahakumbh in Prayagraj..#VijayDeverakonda #MahakumbhStampede #MahakumbhFire #MahaKumbhMela2025 #prayagraj pic.twitter.com/ReTbtO2Hy4
— Sushma (@sush_3006) February 9, 2025
విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. అతని 12వ సినిమా కోసం అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఇప్పటివరకు వెల్లడించలేదు కానీ ఈ మూవీ పోస్టర్లు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ‘VD12’ సినిమా టైటిల్, టీజర్‌ను ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నారు. దీనికి ముందు విజయ్ దేవరకొండ మహాకుంభమేళాలో దేవుడికి ప్రార్థనలు చేశాడు.
కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాలో విజయ్ దేవరకొండ
THE BEAST 🥵🔥@TheDeverakonda #VijayDeverakonda #VD12 pic.twitter.com/qPWsiS5FFI
— VIJAY DEVERAKONDA Edits (@VDKEdits) February 9, 2025
Our Rowdy Vijay Deverakonda At #KumbhMela2025#VijayDeverakonda #VD12 pic.twitter.com/ZUTzrBc5TL
— తెలుగోళం 🚩 (@tinkunikhil8) February 9, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి