5

UI Movie: ఉప్పీ క్రియేటివిటీ మామూలుగా లేదుగా.. సరికొత్తగా ‘యూఐ’ టీజర్‌.. చూస్తే దిమ్మతిరిగిపోద్దంతే

ఉపేంద్ర అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న యూఐ సినిమా టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. చాలా ఏళ్ల తర్వాత ఉపేంద్ర ఈ సినిమాతో మెగా ఫోన్‌ పట్టారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇవాళ (సెప్టెంబర్ 18) ఉపేంద్ర పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని అభిమానుల సమక్షంలో టీజర్‌ను విడుదల చేశారు. బెంగళూరులోని ఊర్వశి సినిమా వద్ద వేలాది మంది అభిమానుల సమక్షంలో యూఐ టీజర్‌ను విడుదల చేశారు

UI Movie: ఉప్పీ క్రియేటివిటీ మామూలుగా లేదుగా.. సరికొత్తగా 'యూఐ' టీజర్‌.. చూస్తే దిమ్మతిరిగిపోద్దంతే
Upendra UI Movie
Follow us

|

Updated on: Sep 18, 2023 | 8:20 PM

ఉపేంద్ర అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న యూఐ సినిమా టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. చాలా ఏళ్ల తర్వాత ఉపేంద్ర ఈ సినిమాతో మెగా ఫోన్‌ పట్టారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇవాళ (సెప్టెంబర్ 18) ఉపేంద్ర పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని అభిమానుల సమక్షంలో టీజర్‌ను విడుదల చేశారు. బెంగళూరులోని ఊర్వశి సినిమా వద్ద వేలాది మంది అభిమానుల సమక్షంలో యూఐ టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ కుమార్, గీతా శివరాజ్ కుమార్, దునియా విజయ్ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సిల్వర్‌ స్క్రీన్‌పై యూటీ టీజర్‌ను ప్రదర్శించారు. అయితే ఇందులో ఏమీ లేదు. చీకటి.. అంతా చీకటి..’ అంటూ మొదలైన టీజర్‌లో కేవలం శబ్దాలు మాత్రమే వినిపించాయి. ‘ఇది ఏఐ వరల్డ్‌ కాదు. ఇది యూఐ వరల్డ్‌. దీని నుంచి తప్పించుకోవాలంటే, మీ తెలివితేటలను వాడండి. ఈ టీజర్‌ మీ ఊహ కోసమే’ అన్న వాయిస్‌తో సాగిన టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఉపేంద్ర ఏం చేసినా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘యూఐ’ సినిమా టీజర్‌లోనూ అది రుజువైంది. ఈరోజు చిత్ర బృందం విడుదల చేసిన ఈ టీజర్‌లో ఎలాంటి దృశ్యాలు కనిపించలేదు. కొన్ని డైలాగులు, శబ్దాలు మాత్రమే వినిపించాయి. మొత్తానికి మరోసారి యూఐ టీజర్‌తో తన క్రియేటివిటీ మార్క్‌ను ప్రూవ్‌ చేసుకున్నాడు ఉపేంద్ర.

మరోవైపు యూఐ టీజర్‌కు మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఇదేం క్రియేటివిటీ అంటుంటే.. ‘అభిమానులు మాత్రం ఉప్పీ స్టైల్‌ ఇలాగే ఉంటుంది’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై కూడా స్పందించాడు ఉపేంద్ర. ‘ఇదంతా మీ ఊహల్లో ఉండనివ్వండి. అదే సరదా. ఇది మీ ఊహలను ఆటపట్టించే టీజర్. మీ తల పైకెత్తి ఊహించుకోండి. మీ తల క్రిందికి ఉంచి, మీ మొబైల్ ఫోన్‌ని చూడటం మానేయండి. ఇందులో ధ్వని ప్రయాణిస్తుంది. అని గమనించండి. ఇది వింటే మీరంతా దర్శకులు అవుతారు’ అని తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు ఉపేంద్ర. అలాగే సినిమాలో పెద్ద ఎత్తున గ్రాఫిక్స్‌ ఉంటుందన్నాడు ఉప్పీ. ‘ ఈ సినిమాలో 90% గ్రాఫిక్స్ ఉన్నాయి. అందుకోసం 4-5 ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. ఆ పని పూర్తయ్యే వరకు నేను నీకు ఏమీ చూపించను. ఈ పుట్టినరోజు గురించి మన అభిమానులు ఎలా అనుకుంటున్నారో చూద్దాం, నేను మీకు ఒక టాస్క్ ఇచ్చాను’ అని చెప్పుకొచ్చాడు ఉపేంద్ర.

యూఐ సినిమా టీజర్

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ. 117 కోట్లు ఇచ్చినా మారని సీన్.. అద్వానంగా ఉప్పల్ స్టేడియం..
రూ. 117 కోట్లు ఇచ్చినా మారని సీన్.. అద్వానంగా ఉప్పల్ స్టేడియం..
ఫుడ్‌ పాయిజన్‌ అయినప్పుడు ఇలా చేశారంటే చిటికెలో ఉపశనం
ఫుడ్‌ పాయిజన్‌ అయినప్పుడు ఇలా చేశారంటే చిటికెలో ఉపశనం
Meenakshi Chaudhary: చాప కింద నీరులా దూసుకొస్తున్న మీనాక్షి చౌదరి
Meenakshi Chaudhary: చాప కింద నీరులా దూసుకొస్తున్న మీనాక్షి చౌదరి
Ind-Pak Match: ప్రపంచకప్‌నకు ముందే.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్..
Ind-Pak Match: ప్రపంచకప్‌నకు ముందే.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్..
గత తొమ్మిదేళ్ల నుంచి మన్‌కీబాత్‌ కార్యక్రమం కీలకపాత్ర..
గత తొమ్మిదేళ్ల నుంచి మన్‌కీబాత్‌ కార్యక్రమం కీలకపాత్ర..
ఐఐటీలో వెజ్-నాన్‌వెజ్ వివాదం.. విద్యార్థికి జరిమాన విధించిన మెస్
ఐఐటీలో వెజ్-నాన్‌వెజ్ వివాదం.. విద్యార్థికి జరిమాన విధించిన మెస్
కాంగ్రెస్‌లోకి కసిరెడ్డి.. డైలమాలో వంశీచంద్‌రెడ్డి..
కాంగ్రెస్‌లోకి కసిరెడ్డి.. డైలమాలో వంశీచంద్‌రెడ్డి..
పార్కింగ్‌లో పెట్టిన బైక్‌లు అనుకునేరు.. యవ్వారం తెలిస్తే.!
పార్కింగ్‌లో పెట్టిన బైక్‌లు అనుకునేరు.. యవ్వారం తెలిస్తే.!
పెళ్లికి ముందే నటి శ్రీదేవి ప్రెగ్నెంట్‌? బోనీ కపూర్ క్లారిటీ..
పెళ్లికి ముందే నటి శ్రీదేవి ప్రెగ్నెంట్‌? బోనీ కపూర్ క్లారిటీ..
యూపీఐ లైట్‌ వల్ల ప్రయోజనం ఏమిటి..? నిబంధనలు ఏంటి?
యూపీఐ లైట్‌ వల్ల ప్రయోజనం ఏమిటి..? నిబంధనలు ఏంటి?