SS Rajamouli: మన టోలీచౌకీ అబ్బాయ్‌ అదరగొట్టేశాడు.. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌కు రాజమౌళి ఫిదా

ఆదివారం కొలంబో వేదికగా జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో భారత జట్టు లంకేయులను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆరు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. తన సూపర్‌ స్పెల్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన అతనికే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది. వన్డే క్రికెట్‌ ఫార్మాట్‌లో నంబర్‌వన్ బౌలర్‌గా దూసుకెళుతోన్న సిరాజ్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి

SS Rajamouli: మన టోలీచౌకీ అబ్బాయ్‌ అదరగొట్టేశాడు.. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌కు రాజమౌళి ఫిదా
SS Rajamouli, Mohammed Siraj
Follow us

|

Updated on: Sep 17, 2023 | 8:31 PM

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ను టీమిండియా గెల్చుకోవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. ప్రపంచకప్‌కు ముందు భారత్‌ ఇలాంటి గొప్ప విజయం సాధించడం అద్భుతమంటూ ఫ్యాన్స్‌ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో భారత జట్టు లంకేయులను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆరు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. తన సూపర్‌ స్పెల్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన అతనికే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది. వన్డే క్రికెట్‌ ఫార్మాట్‌లో నంబర్‌వన్ బౌలర్‌గా దూసుకెళుతోన్న సిరాజ్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి సిరాజ్‌ బౌలింగ్‌కు ఫిదా అయ్యారు. హైదరాబాద్‌ నగరంలోని టోలీచౌకి కుర్రాడు ఆరు వికెట్లతో అద్భుతమైన బౌలింగ్ చేశాడంటూ సిరాజ్‌ను కొనియాడారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేయడంతో పాటు ట్వీట్ కూడా చేశారు రాజమౌళి. ‘సిరాజ్ మియాన్, మన టోలీచౌకీ కుర్రాడు ఆసియా కప్ ఫైనల్‌లో 6 వికెట్లతో మెరిశాడు. అంతే కాకుండాతన బౌలింగ్‌లో బౌండరీని ఆపడానికి లాంగ్ ఆన్‌కి పరిగెత్తి అందరి మనసులను గెల్చుకున్నాడు’ అని ఈ ట్వీట్‌లో రాసుకొచ్చారు రాజమౌళి. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మీరు చెప్పింది నిజమే సార్‌.. సిరాజ్ అదరగొట్టాడు. వెయిటింగ్‌ ఫర్‌ వరల్డ్‌ కప్‌’ అంటూ జక్కన్న ట్వీట్‌పై క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ఆసియా కప్‌ టైటిల్‌ ను గెల్చుకుంది టీమిండియా. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి కేవలం 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్‌ ఆరు వికెట్లు పడగొట్టగా, హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్లతో లంక పతనంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ కేవలం ఆరు ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 7 ఓవర్లు వేసిన సిరాజ్‌ కేవలం 21 పరుగులు ఇచ్చి ఆరు వికెట్ల పడగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సొంతం చేసుకున్నాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో సినిమా చేస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. సూపర్‌ హీరో తరహాలో అడ్వెంచెరస్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

రాజమౌళి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..