Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej- Lavanya Tripathi: కల్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి..పెళ్లి షాపింగ్‌లో వరుణ్‌, లావణ్య బిజీ బిజీ.. వీడియో

టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి మరికొన్ని రోజుల్లో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్న ఈ ప్రేమ జంట త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. అటు వరుణ్‌, ఇటు లావణ్య ఫ్యామిలీస్‌లో పెళ్లి పనులు కూడా షురూ అయినట్లు తెలుస్తోంది. నవంబర్‌ 1న వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యిందని తెలుస్తోంది. ఇటలీలోని ఓ ప్యాలెస్‌లో వరుణ్‌, లావణ్యల వివాహం జరగనుందని..

Varun Tej- Lavanya Tripathi: కల్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి..పెళ్లి షాపింగ్‌లో వరుణ్‌, లావణ్య బిజీ బిజీ.. వీడియో
Varun Tej, Lavanya Tripathi
Follow us
Basha Shek

|

Updated on: Sep 16, 2023 | 6:57 PM

టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి మరికొన్ని రోజుల్లో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్న ఈ ప్రేమ జంట త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. అటు వరుణ్‌, ఇటు లావణ్య ఫ్యామిలీస్‌లో పెళ్లి పనులు కూడా షురూ అయినట్లు తెలుస్తోంది. నవంబర్‌ 1న వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యిందని తెలుస్తోంది. ఇటలీలోని ఓ ప్యాలెస్‌లో వరుణ్‌, లావణ్యల వివాహం జరగనుందని సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు హాజరుకానున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అటు వరుణ్‌, ఇటు లావణ్యల ఫ్యామిలీస్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఇరు కుటుంబాల్లోనూ పెళ్లి ఏర్పాట్లు షర వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. తాజాగా ఓ షాపింగ్‌మాల్‌లో జంటగా కనిపించారు వరుణ్‌ తేజ్‌- లావణ్య. హైదరాబాద్‌లోని ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రాకు చెందిన షో రూమ్‌లో సందడి చేశారీ లవ్ బర్డ్స్‌. పెళ్లికి సంబంధించిన దుస్తులు, ఇతరత్రా షాపింగ్ కోసమే వీరు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిక సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇక సుమారు ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్‌ సినిమాలో జోడీగా కనిపించారు వరుణ్‌- లావణ్య. అప్పుడే వీరి మధ్య స్నేహం చిగురించిందని తెలుస్తోంది. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలోనూ కలిసి నటించిన ఈ జంట తమ ప్రేమ వ్యవహారాన్ని మాత్రం చాలా గోప్యంగా ఉంచింది. అయితే ఈ ఏడాది జూన్‌ 9న ఉంగరాలు మార్చుకుని తమ ప్రేమ బంధాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. త్వరలోనే ఏడడుగుల బంధంతో ఒకటి కానున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. వరుణ్ తేజ్‌ నటించిన గాంఢీవధారి అర్జున ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ వరుణ్‌కు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే ఓ సినిమా చేస్తున్నాడు మెగా ప్రిన్స్‌. దీంతో పాటు ఆపరేషన్ వాలంటైన్‌ అనే మూవీకి ఓకే చెప్పాడు. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక లావణ్య త్రిపాఠి చివరిగా పులి మేక అనే వెబ్‌ సిరీస్‌లో కనిపించింది. జీ5లో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ఈ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం థనల్ అనే తమిళ సినిమాలో చేస్తోంది. ‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్‌ అథర్వ మురళి ఈ సినిమాలో హీరో.

ఇవి కూడా చదవండి

పెళ్లి షాపింగ్ లో లావణ్య, వరుణ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్‌ చేసి..వీ
మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్‌ చేసి..వీ
శ్రీలీల,కార్తిక్‌ ఆర్యన్‌ డేటింగ్‌.. హీరో తల్లి షాకింగ్ కామెంట్స్
శ్రీలీల,కార్తిక్‌ ఆర్యన్‌ డేటింగ్‌.. హీరో తల్లి షాకింగ్ కామెంట్స్
పిచ్చి పీక్‌ స్టేజ్‌లో.. బతికి ఉన్న బొద్దింకతో కృతిమ గోరు తయారీ
పిచ్చి పీక్‌ స్టేజ్‌లో.. బతికి ఉన్న బొద్దింకతో కృతిమ గోరు తయారీ
10th విద్యార్ధులకు అలర్ట్.. జవాబు పత్రాల మూల్యంకనం ఎప్పట్నుంచంటే!
10th విద్యార్ధులకు అలర్ట్.. జవాబు పత్రాల మూల్యంకనం ఎప్పట్నుంచంటే!