HER OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌.. రుహానీ శర్మ ‘హర్‌’ ఎక్కడ చూడొచ్చంటే?

చి.ల. సౌ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది రుహానీ శర్మ. ఇందులో అంజలి అనే పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ప్రస్తుతం వెంకటేశ్‌ సైంధవ సినిమాలో కీ రోల్‌ పోషిస్తోంది. కాగా రుహాని నటించిన లేటెస్ట్‌ సినిమా 'హర్‌- ఛాప్టర్‌ 1'.

HER OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌.. రుహానీ శర్మ 'హర్‌' ఎక్కడ చూడొచ్చంటే?
Ruhani Sharma
Follow us

|

Updated on: Sep 15, 2023 | 1:30 PM

చి.ల. సౌ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది రుహానీ శర్మ. ఇందులో అంజలి అనే పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ప్రస్తుతం వెంకటేశ్‌ సైంధవ సినిమాలో కీ రోల్‌ పోషిస్తోంది. కాగా రుహాని నటించిన లేటెస్ట్‌ సినిమా ‘హర్‌- ఛాప్టర్‌ 1’. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ జులై 21 న థియేటర్లలో రిలీజైంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ డిస్ట్రిబ్యూట్‌ చేయడంతో సినిమాపై హైప్‌ వచ్చింది. అయితే ప్రమోషన్‌ కార్యక్రమాలు పెద్దగా నిర్వహించలేదు. దీంతో ఆడియెన్స్‌ నుంచి పెద్దగా రెస్పాన్స్‌ కాలేదు. అయితే సినిమా చూసిన వారంతా కాన్సెప్ట్‌, థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ బాగుందని కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. అలాగే రుహానీ నటన కూడా బాగుందంటూ కితాబిచ్చారు థియేటర్లలో మోస్తరుగా ఆడిన హర్‌-ఛాప్టర్‌ 1 ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో హర్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ ను కొనుగోలు చేసింది. శుక్రవారం (సెప్టెంబర్‌ 15) అర్ధరాత్రి నుంచే రుహానీ శర్మ ఓటీటీలోకి వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

హర్ – చాప్టర్ 1 సినిమాలో రుహానీ శర్మ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించింది. ఆమెతో పాటు వికాశ్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, సంజయ్ స్వరూప్, బెనర్జీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీధరర్‌ స్వరాగమ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. డబుల్ అప్ మీడియాస్ పతాకంపై రఘు సంకురాత్రి, దీప ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ స్వరాలు అందించగా.. చాణక్య ఎడిటర్‌గా, విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాద్‌ నగర శివార్లలో వరుసగా రెండు హత్యలు జరుగుతాయి. వీటి గుట్టు తెలుసుకునేందుకు ఏసీపీ అర్చనా ప్రసాద్‌ (రుహానీ) రంగంలోకి దిగింది. మరి ఈ హత్యలు ఎవరు, ఎందుకు చేశారు? ఏసీపీ అర్చన నేరస్తులను ఎలా పట్టిందు తెలుసుకోవాలంటే హర్‌ సినిమా చూడాల్సిందే. సినిమాలోని ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి. మరి థియేటర్లలో ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇన్వెస్టిగేషన్‌ సినిమాను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఓటేయండి.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

వెంకటేష్ సైంధవ్ సినిమాలో రుహానీ శర్మ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
భారీ వర్షంతో గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. టైటాన్స్ ఇక ఇంటికే.
భారీ వర్షంతో గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. టైటాన్స్ ఇక ఇంటికే.
ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో ఏపీ పోలింగ్ పర్సెంటేజ్
పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో ఏపీ పోలింగ్ పర్సెంటేజ్
ఆర్సీబీకి పిడుగులాంటి వార్త.. స్వదేశానికి స్టార్ ప్లేయర్లు
ఆర్సీబీకి పిడుగులాంటి వార్త.. స్వదేశానికి స్టార్ ప్లేయర్లు
సిటీకి రిటన్ అయిన జనం.. రద్దీగా టోల్‌గేట్లు
సిటీకి రిటన్ అయిన జనం.. రద్దీగా టోల్‌గేట్లు
వారణాసిలో అద్వితీయంగా సాగిన ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
వారణాసిలో అద్వితీయంగా సాగిన ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
'ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా'.. 'త్రినయని' నటి మరణంపై భర్త
'ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా'.. 'త్రినయని' నటి మరణంపై భర్త
ఇంకా ఎన్నాళ్లు ఈ లేఆఫ్‌లు ?? సుందర్‌ పిచాయ్‌ సమాధానమిదే
ఇంకా ఎన్నాళ్లు ఈ లేఆఫ్‌లు ?? సుందర్‌ పిచాయ్‌ సమాధానమిదే
సమంత కంపెనీలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
సమంత కంపెనీలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!
ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!