Kushi OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘ఖుషి’.. విజయ్‌, సమంతల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి. టైటిల్‌తోనే ఈ సినిమాకు పాజిటివ్‌ వైబ్స్‌ రావడం, దీనికి తోడు టీజర్లు, సాంగ్స్‌, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అనుకున్నట్లే సెప్టెంబర్‌ 1 న థియేటర్లలో రిలీజైన ఖుషి సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. విజయ్‌, సమంతల కెమిస్ట్రీ వర్కవుట్ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ నుంచి కూడా మౌత్‌ టాక్‌ బాగా రావడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లే వచ్చాయి

Kushi OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'ఖుషి'.. విజయ్‌, సమంతల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kushi Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 14, 2023 | 1:46 PM

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి. టైటిల్‌తోనే ఈ సినిమాకు పాజిటివ్‌ వైబ్స్‌ రావడం, దీనికి తోడు టీజర్లు, సాంగ్స్‌, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అనుకున్నట్లే సెప్టెంబర్‌ 1 న థియేటర్లలో రిలీజైన ఖుషి సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. విజయ్‌, సమంతల కెమిస్ట్రీ వర్కవుట్ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ నుంచి కూడా మౌత్‌ టాక్‌ బాగా రావడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లే వచ్చాయి. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లోవెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్, జయరాం, సచిన్‌ కేడ్కర్‌, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి ఖుషి సినిమాను నిర్మించారు. థియేటర్లలో ఇప్పటికీ ఈ సినిమా ఆడుతోంది. మరోవైపు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని విజయ్‌, సామ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఖుషి సినిమా ఓటీటీ రిలీజ్‌ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. విజయ్‌, సామ్‌ల సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసింది. అక్టోబర్‌ 6 నుంచి ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఖుషి సినిమా ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

ఖుషి సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాష ల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజైంది. కాబట్టి ఓటీటీలో కూడా ఈ భాషల్లోనే రిలీజ్ కావొచ్చని సమాచారం. ఖుషి సినిమాకు హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన స్వరాలు హైలెట్‌గా నిలిచాయి. ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌గా వ్యవహరించారు. ఇక ఖుషి సినిమా తర్వాత పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్‌. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గీత గోవిందం బ్లాక్‌ బస్టర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. VD13 (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్‌ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్‌.

ఇవి కూడా చదవండి

సమంత లేటెస్ట్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!