Dhruva Sarja: అన్నదమ్ముల అనుబంధం.. సోదరుడి సమాధి వద్దే భార్య సీమంతం చేసిన స్టార్‌ హీరో.. వీడియో చూశారా?

ధ్రువ సర్జా అనుకుంటే ఓ పెద్ద స్టార్‌ హోటల్‌లో ఈ ఫంక్షన్‌ నిర్వహించి ఉండవచ్చు. అయితే ఆయన అలా చేయలేదు. మూడేళ్ల క్రితం కన్నుమూసిన తన అన్న హీరో చిరంజీవి సర్జా సమాధి దగ్గరే భార్య సీమంతం నిర్వహించారు. తద్వారా అన్నపై తనకున్న ప్రేమను చాటుకున్నాడీ స్టార్‌ హీరో. ఇది చూసి అభిమానులు ఎమోషనల్‌ అవుతున్నారు. 'అన్నదమ్ముల అనుబంధమంటే ఇదే' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Dhruva Sarja: అన్నదమ్ముల అనుబంధం.. సోదరుడి సమాధి వద్దే భార్య సీమంతం చేసిన స్టార్‌ హీరో.. వీడియో చూశారా?
Dhruva Sarja Family
Follow us
Basha Shek

|

Updated on: Sep 12, 2023 | 9:33 AM

కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు ధ్రువ సర్జా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది . అతని భార్య ప్రేరణ ప్రస్తుతం గర్భంతో ఉంది. ధ్రువ సర్జా, ప్రేరణ దంపతులు త్వరలోనే రెండోసారి అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందనున్నారు. ప్రేరణ త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా ఇటీవలే అధికారికంగా ప్రకటించారీ లవ్లీకపుల్. ఇప్పుడు ప్రేరణ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ధ్రువ్‌, ప్రేరణల కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ధ్రువ సర్జా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన సినీ ప్రముఖులు అభిమానులు, నెటిజన్లు ధ్రువ సర్జా దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే ధ్రువ సర్జా అనుకుంటే ఓ పెద్ద స్టార్‌ హోటల్‌లో ఈ ఫంక్షన్‌ నిర్వహించి ఉండవచ్చు. అయితే ఆయన అలా చేయలేదు. మూడేళ్ల క్రితం కన్నుమూసిన తన అన్న హీరో చిరంజీవి సర్జా సమాధి దగ్గరే భార్య సీమంతం నిర్వహించారు. తద్వారా అన్నపై తనకున్న ప్రేమను చాటుకున్నాడీ స్టార్‌ హీరో. ఇది చూసి అభిమానులు ఎమోషనల్‌ అవుతున్నారు. ‘అన్నదమ్ముల అనుబంధమంటే ఇదే’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అన్నలేని లోటు ..

ధ్రువ సర్జా కంటే ముందే కన్నడ చిత్ర పరిశ్రమలో యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి సర్జా. పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన ఆయన 2020లో గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఇది ఆ కుటుంబానికి తీరని లోటుగా పరిణమించింది. అందుకే ఇంట్లో పండగలు, పర్వదినాలు, ప్రత్యేక సందర్భాల్లోనూ చిరు సమాధికి అందరూ పూజలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా చిరంజీవి సమాధి ఉన్నఫామ్‌ హౌస్‌లోనే తన భార్య సీమంతం వేడుకలు నిర్వహించాడు ధ్రువ్‌ సర్జా. ఈ సందర్భంగా పూలతో ఫామ్ హౌస్‌ను అందంగా అలంకరించారు. కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి ప్రేరణను ఆశీర్వదించారు. కాగా ధ్రువ సర్జా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ‘మార్టిన్‌’, ‘కేడి’ వంటి పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడాయన. ఇక ధ్రువ, ప్రేరణ 2019 లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2022 అక్టోబర్‌లో ఆడపిల్ల జన్మించింది.

ఇవి కూడా చదవండి

ధ్రువ్ సర్జా భార్య సీమంతం.. వీడియో

త్వరలోనే సిల్వర్‌ స్క్రీన్‌పై మేఘనా రాజ్‌..

కాగా గుండెపోటుతో కన్నుమూఏసిన చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్‌ కూడా ఓ ప్రముఖ నటి. అల్లరి నరేష్‌ నటించిన ‘బెండు అప్పారావ్‌ ఆర్‌ఎంపీ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆతర్వాత కన్నడలో పలు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించింది. ఇదే సమయంలో చిరంజీవితో ప్రేమలో పడి అతనితో ఏడడుగులు నడిచింది. అయితే పెళ్లైన మూడేళ్లకే భర్త గుండెపోటుతో కన్నుమూయడంతో డిప్రెషన్‌కు గురైంది. అప్పటికే గర్భంతో ఉన్న ఆమె కుమారుడి రాకతో మళ్లీ కోలుకుంది. త్వరలోనే సినిమాల్లో కూడా నటించనుందామె.

భర్త తో  చిరంజీవి సర్జాతో మేఘనా రాజ్

View this post on Instagram

A post shared by Meghana Raj Sarja (@megsraj)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..