Bigg Boss 7 Telugu: శివాజీ వర్సెస్ ప్రియాంక జైన్.. నీకంత సినిమా లేదు అంటూ మాటల యుద్ధం..

ఇక ఇప్పుడు రెండో వారంలో నామినేషన్స్ మొదలు పెట్టారు బిగ్ బాస్. హౌస్‌లో ఉన్న వారు ఒకొక్కరిని నామినేట్ చేసి అందుకు గల కారణం చెప్పమని తెలిపాడు. దాంతో నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ నామినేషన్స్ ప్రక్రియ వాడి వేడిగా సాగుతోంది. అయితే పవర్ అస్త్ర సాధించిన ఆట సందీప్ నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు. అలాగే డైరెక్ట్ గా ఒకరిని నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో ప్రిన్స్ యావర్ ను నామినేట్ చేశాడు సందీప్. అయితే ఇందుకు కారణం చెప్పమంటే నాగార్జునగారు తక్కువ మార్కులు వేశారు అందుకే నామినేట్ చేస్తున్నా అని తెలిపాడు. 

Bigg Boss 7 Telugu: శివాజీ వర్సెస్ ప్రియాంక జైన్.. నీకంత సినిమా లేదు అంటూ మాటల యుద్ధం..
Shivaji , Priyanka Jain
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 12, 2023 | 9:16 AM

బిగ్ బాస్ హౌస్ లో మరోసారి నామినేషన్ పర్వం మొదలైంది. మొదటి వారం పూర్తయ్యి రెండో వారం లోకి అడుగుపెట్టింది బిగ్ బాస్ సీజన్ 7. ఇక మొదటి వారంలో కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. హౌస్ లో ప్రస్తుతం 13 మంది ఉన్నారు. ఇక ఇప్పుడు రెండో వారంలో నామినేషన్స్ మొదలు పెట్టారు బిగ్ బాస్. హౌస్‌లో ఉన్న వారు ఒకొక్కరిని నామినేట్ చేసి అందుకు గల కారణం చెప్పమని తెలిపాడు. దాంతో నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ నామినేషన్స్ ప్రక్రియ వాడి వేడిగా సాగుతోంది. అయితే పవర్ అస్త్ర సాధించిన ఆట సందీప్ నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు. అలాగే డైరెక్ట్ గా ఒకరిని నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో ప్రిన్స్ యావర్ ను నామినేట్ చేశాడు సందీప్. అయితే ఇందుకు కారణం చెప్పమంటే నాగార్జునగారు తక్కువ మార్కులు వేశారు అందుకే నామినేట్ చేస్తున్నా అని తెలిపాడు.

నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావ్ అంటూ యావర్ వాదనకు దిగాడు. దాంతో మరో రీజన్ చెప్పాడు. ఇక సందీప్ నామినేట్ చేయడంతో యావర్ ను ఎవ్వరూ నామినేట్ చేయకూడదు అని అన్నారు బిగ్ బాస్. అయితే ఈ సారి బిగ్ బాస్ ఉల్టా పుల్టా  ఉంటుందని చెప్పిన బిగ్ బాస్. ఒక వ్యక్తి వచ్చి నిలబడితే అతడిని ఎంతమంది నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్లు వచ్చి అతడి పై బజర్ నొక్కి రంగు నీళ్లు పోయాలి అని తెలిపారు. అలాగే ప్రతో ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలనీ తెలిపాడు బిగ్ బాస్.

దాంతో  ముందుగా టేస్టీ తేజా ను నామినేట్ చేసేవారు రావాలని కోరగా.. పల్లవి ప్రశాంత్, శుభశ్రీ రాయగురు, రతికలు తేజను నామినేట్ చేశారు. దాంతో రతిక, తేజకు మధ్య వాదన జరిగింది. ఏం పీకుతున్నావ్ అనే పదం తనకు నచ్చలేదు అని తెలిపింది రతిక. తిని తొంగుంటున్నావ్ .. అని నువ్ అన్నావ్ కదా అంటూ కౌంటర్ ఇచ్చాడు తేజ. ఆతర్వాత దామినిని ఎవ్వరూ నామినేట్ చేయలేదు. శివాజీ వచ్చి నిలుచుంటే.. ప్రియాంక, అమర్ దీప్, శోభా శెట్టి, షకీలా అతడిని నామినేట్ చేశారు. శివాజీని మొత్తం ఆరుగురు నామినేట్ చేశారు. అయితే శివాజీని నామినేట్ చేస్తూ ఎవరి రీజన్స్ వారు చెప్పారు కానీ శివాజీ ఒకొక్కరికి కౌంటర్లు ఇచ్చారు. ముఖ్యంగా ప్రియాంక జైన్ శివాజీ మధ్య వాదన గట్టిగానే జరిగింది. ప్రియాంక రాగానే ‘నువ్వు కంప్లీట్ చేయలేవ్‌లే కానీ.. పో.. పో’ అంటూ యాటిట్యూడ్ చూపించారు శివాజీ . దాంతో ప్రియాంక రెచ్చిపోయింది. ఏంటి పో.. నువ్వు ఎవరు పో అనడానికి.. రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు రెస్పెక్ట్ తీసుకోండి అంటూ ఫైర్ అయ్యింది. నీకంత సినిమా లేదు కానీ పో అంటూ కౌంటర్ ఇచ్చారు శివాజీ. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చేదానివి కాదు కానీ.. హౌస్‌ని మ్యానేజ్ చేస్తున్నావ్.. అని అన్నారు శివాజీ.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!