Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: ‘బాస్‌.. గుండు బాస్‌’.. ‘శివాజీ’ స్టైల్‌లో రజనీకి స్వాగతం పలికిన మలేషియా ప్రధాని.. వీడియో చూశారా?

సూపర్ స్టార్ రజనీకాంత్ మలేషియాలో పర్యటిస్తున్నారు. ఆదేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం రజనీకాంత్‌కి వినూత్నంగా స్వాగతం పలికారు.  సూపర్ స్టార్ నటించిన 'శివాజీ' సినిమా స్టైల్‌లో రజనీకి వెల్కమ్ పలికారాయన.  రజనీకాంత్ నటించిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో శివాజీ ఒకటి. ఇందులో  ఆయన గుండు గెటప్‌లో కనిపిస్తారు. ఆ గెటప్‌లో 'రజనీ తన గుండుపై చేతి వేళ్లతో కొడుతూ..

Rajinikanth: 'బాస్‌.. గుండు బాస్‌'.. 'శివాజీ' స్టైల్‌లో రజనీకి స్వాగతం పలికిన మలేషియా ప్రధాని.. వీడియో చూశారా?
Rajinikanth, PM Anwar Ibrahim
Follow us
Basha Shek

|

Updated on: Sep 12, 2023 | 12:31 PM

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయనను చూసేందుకు ఫ్యాన్స్‌ క్యూ కడతారు. ఇక విదేశాల్లోనూ రజనీ మేనియా మాములుగా లేదు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ మలేషియాలో పర్యటిస్తున్నారు. ఆదేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం రజనీకాంత్‌కి వినూత్నంగా స్వాగతం పలికారు.  సూపర్ స్టార్ నటించిన ‘శివాజీ’ సినిమా స్టైల్‌లో రజనీకి వెల్కమ్ పలికారాయన.  రజనీకాంత్ నటించిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో శివాజీ ఒకటి. ఇందులో  ఆయన గుండు గెటప్‌లో కనిపిస్తారు. ఆ గెటప్‌లో ‘రజనీ తన గుండుపై చేతి వేళ్లతో కొడుతూ ‘బాస్‌.. గుండూ బాస్‌’ అంటూ తనదైన స్టైల్లో డైలాగ్‌ చెబుతాడు. ఇప్పుడే ఇదే స్టైల్‌లో రజనీకి వెల్కమ్‌ చెప్పారు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సినిమాల్లో స్టైల్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసే రజనీకాంత్ నిజ జీవితంలో మాత్రం ఎంతో సింపుల్‌గా ఉంటారు. తాజాగా మలేషియా పర్యటనలోనూ దీనిని మరోసారి ప్రూవ్‌ చేశారాయన. పంచె, తెల్ల చొక్కా వేసుకుని మలేషియా ప్రధానిని కలిశారు. ఇద్దరూ చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు. కాగా ఉన్నట్లుండి రజనీ, మలేషియా భేటీ కావడం ప్రాధాన్యత సంచరించుకుంది. వీరెందుకు సమావేశమయ్యారో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

పంచె, తెల్ల చొక్కాతో..

మరోవైపు రజనీతో భేటీ ఫొటోలను తన అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ చేశారు ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం. ‘ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్‌ను కలవడం నాకెంతో సందగా ఉంది. ప్రజల కష్టాలు, ఆ కష్టాల సమయంలో నేను అందించిన సేవల పట్ల ఆయన ఎంతో గౌరవం చూపారు. భవిష్యత్‌లో రజనీ నటించనున్న సినిమాల్లో సామాజిక అంశాలు పుష్కలంగా ఉండేలా చూడాలని నేను కోరాను. అలాగే రజనీకాంత్ ఎంచుకున్న ప్రతిరంగంలో ఆయన సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా’ అని తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం. కాగా రజనీకాంత్‌ నటించిన జైలర్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. నెల్సన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఏకంగా రూ.650 కోట్లు రాబట్టింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత సన్ పిక్చర్స్ రజనీకాంత్ తో కొత్త సినిమాని అనౌన్స్ చేసింది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఇది రజనీకాంత్‌కి 171వ సినిమా. ఈ చిత్రానికి ‘తలైవర్ 171’ అనే టైటిల్‌ను తాత్కాలికంగా ఖరారు చేశారు.

ఇవి కూడా చదవండి

రజనీకి స్వాగతం పలుకుతున్న మలేషియా ప్రధాని

రజనీతో భేటీపై మలేషియా ప్రధాని ట్వీట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.