AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maayon OTT: ఓటీటీలోకి వచ్చేసిన అడ్వెంచర్‌ థ్రిల్లర్‌.. మాయోన్ తెలుగు వెర్షన్‌ ఎక్కడ చూడొచ్చంటే?

టీవల థియేటర్లలో రిలీజైన కొన్ని సినిమాలు ఓటీటీల్లోకి రావడం లేదు. అఖిల్‌ ఏజెంట్‌, ది కేరళ స్టోరీ సినిమాలు థియేటర్లలో రిలీజై నెలలు గడుస్తున్నాయి. అయితే ఇంతవరకు డిజిటల్‌ స్ట్రీమింగ్ కు రాలేదు. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఒక్కోసారి సడెన్‌గా ఓటీటీలోకి దర్శనమిస్తుంటాయి కొన్ని సినిమాలు. అలా గతేడాది థియేటర్లలో రిలీజైన ఒక మైథలాజికల్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

Maayon OTT: ఓటీటీలోకి వచ్చేసిన అడ్వెంచర్‌ థ్రిల్లర్‌.. మాయోన్ తెలుగు వెర్షన్‌ ఎక్కడ చూడొచ్చంటే?
Maayon Movie
Basha Shek
|

Updated on: Sep 14, 2023 | 9:38 AM

Share

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి సినిమాలు. ఒక్కోసారి ముందుగానే వస్తుంటాయి. ఇంకోసారి ఆలస్యంగానూ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. దర్శక నిర్మాతలు, ఓటీటీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ఇదంతా జరుగుతుంది. అయితే ఇటీవల థియేటర్లలో రిలీజైన కొన్ని సినిమాలు ఓటీటీల్లోకి రావడం లేదు. అఖిల్‌ ఏజెంట్‌, ది కేరళ స్టోరీ సినిమాలు థియేటర్లలో రిలీజై నెలలు గడుస్తున్నాయి. అయితే ఇంతవరకు డిజిటల్‌ స్ట్రీమింగ్ కు రాలేదు. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఒక్కోసారి సడెన్‌గా ఓటీటీలోకి దర్శనమిస్తుంటాయి కొన్ని సినిమాలు. అలా గతేడాది థియేటర్లలో రిలీజైన ఒక మైథలాజికల్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. బాహుబలి సినిమాలో కట్టప్పగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యరాజ్‌. ఇప్పుడు ఆయన తనయుడు సిబి సత్యరాజ్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అలా సిబిరాజ్‌ నటించిన సినిమా మయోన్‌. ఎన్. కిషోర్ తెరకెక్కించిన ఈ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌లో తాన్యా రవిచంద్రన్‌ హీరోయిన్‌గా నటించింది. గతేడాది జులై 7న థియేటర్లలో రిలీజైన మాయోన్‌ ఓ మోస్తరుగా ఆడింది. ఆసక్తికరమైన కథా, కథనాలు, విజవల్స్, అడ్వెంచర్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు కూడా ఓ మోస్తరుగానే వచ్చాయి.

కాగా థియేటర్లలో రిలీజైన తర్వాత ఏడాదికి కానీ మాయోన్‌ ఓటీటీ రిలీజ్‌కు మోక్షం కలగలేదు. ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. నెల రోజులక్రితం తమిళంలో స్ట్రీమింగ్ అయిన మాయోన్ తాజాగా తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ బ్యానర్‍పై మామిడాల శ్రీనివాస్, అరుణ్ మోజి మాణిక్యం మాయోన్‌ను నిర్మించారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. కెమెరామెన్‌ రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మరి థియేటర్లలో మాయోన్‌ను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

థియేటర్లలో రిలీజైన  ఏడాది తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు..

శిబి సత్యరాజ్ ఫ్యామిలీ ఫొటో

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి