Vijay Devarakonda: మాట నిలబెట్టుకున్న విజయ్‌ దేవరకొండ.. 100 కుటుంబాలకు తలా లక్ష ఆర్థిక సాయం.. లిస్టు ఇదుగో

లక్ష రూపాయలు అందుకునే 100 మంది అభిమానుల జాబితాను అఫీషియల్‌గా ప్రకటించాడీ రౌడీ హీరో. 'మేం ఎంపిక చేసిన 100 కుటుంబాలు. ఈ సహాయం వారి ఫ్యామిలీలో ఆనందోత్సాహాలను నింపుతుందని అనుకుంటున్నా'అంటూ 100 మంది కుటుంబాల జాబితాను ప్రకటించాడు విజయ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడంటూ అభిమానులు రౌడీబాయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Vijay Devarakonda: మాట నిలబెట్టుకున్న విజయ్‌ దేవరకొండ.. 100 కుటుంబాలకు తలా లక్ష ఆర్థిక సాయం.. లిస్టు ఇదుగో
Vijay Deverakonda
Follow us
Basha Shek

|

Updated on: Sep 14, 2023 | 1:12 PM

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ఖుషి సినిమా సూపర్‌ హిట్‌ కావడం, ఈ సంతోషాన్ని తన అభిమానులతో కూడా షేర్‌ చేసుకుంటానన్న విజయ్‌ 100 మంది అభిమానులకు లక్ష సాయం అందిస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం పది రోజుల సమయం తీసుకున్న విజయ్‌ ఒక ఫామ్‌ తీసుకుని రిజిస్టర్‌ అవ్వండంటూ తన అభిమానులకు పిలుపునిచ్చాడు. ఇప్పుడు తన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో మరో ముందడుగు వేశాడు విజయ్‌. తాజాగా లక్ష రూపాయలు అందుకునే 100 మంది అభిమానుల జాబితాను అఫీషియల్‌గా ప్రకటించాడీ రౌడీ హీరో. ‘మేం ఎంపిక చేసిన 100 కుటుంబాలు. ఈ సహాయం వారి ఫ్యామిలీలో ఆనందోత్సాహాలను నింపుతుందని అనుకుంటున్నా’అంటూ 100 మంది కుటుంబాల జాబితాను ప్రకటించాడు విజయ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడంటూ అభిమానులు రౌడీబాయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా సమంతతో కలిసి విజయ్‌ దేవరకొండ నటించిన ఖుషి సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. సెప్టెంబర్‌ 1న విడుదలైన ఈ ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

100 మంది కుటుంబాల ఎంపిక..

ఈ సందర్భంగా నిర్వహించిన ఖుషి సక్సెస్‌మీట్‌లో విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌ అయ్యాడు. ఖుషి సినిమాను సూపర్‌ సక్సెస్‌ చేసినందుకుగానూ అభిమానులకు రూ. లక్ష సాయం ప్రకటించాడు విజయ్‌. తన సంతోషాన్ని ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకోవాలని ఉందని, అందుకే 100 మందికి రూ. లక్ష చొప్పున మొత్తం కోటి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నానన్నాడు. ఇందుకోసం సోషల్‌ మీడియా వేదికగా ఒక ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఏర్పాటుచేశాడు. ఇప్పుడు 100 మంది కుటుంబాల జాబితాను కూడా ప్రకటించి తన మాటను నిలబెట్టుకున్నాడు. శివనిర్వాణ తెరకెక్కించిన ఖుషి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించారు. ఇందులో విజయ్‌, సమంతలతో పాటు వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్, జయరాం, సచిన్‌ కేడ్కర్‌, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హృదయం ఫేమ్‌ హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరాలు సమకూర్చారు. ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌గా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

 జాబితా ఇదుగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..