Bigg Boss 7 Telugu: పవర్ అస్త్ర పోగొట్టుకున్న సందీప్.. అన్యాయం అంటూ ఆవేదన

ఆట సందీప్ పవర్ అస్త్రను గెలుచుకున్న విషయం తెలిసిందే. పవర్ అస్త్రను గెలుచుకున్న సందీప్ 5 వారల ఇమ్యూనిటీ ని పొందాడు. దాంతో ఆడాడు బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూ అయ్యే మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఇక మయా అస్త్ర అంటూ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వారికి టాస్క్ లు ఇచ్చారు. రకరకాల గేమ్స్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్. ఇక హౌస్ లో ఉన్న వారిని రెండు భాగాలుగా విడదీసి గేమ్ ఆడిస్తున్నారు. రణధీర, మహాబలి రెండు టీమ్స్ గా విడదీసి గేమ్స్ ఆడిస్తున్నారు బిగ్ బాస్. 

Bigg Boss 7 Telugu: పవర్ అస్త్ర పోగొట్టుకున్న సందీప్.. అన్యాయం అంటూ ఆవేదన
Bigg Boss 7
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 14, 2023 | 1:13 PM

బిగ్ బాస్ హౌస్ లో రచ్చరచ్చ జరుగుతోంది. రెండో వరం నామినేషన్ లో 9 మంది ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, రతిక, టేస్టీ తేజా, అమర్ దీప్ చౌదరి, షకీలా, గౌతమ్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ ఈసారి నామినేషన్స్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఆట సందీప్ పవర్ అస్త్రను గెలుచుకున్న విషయం తెలిసిందే. పవర్ అస్త్రను గెలుచుకున్న సందీప్ 5 వారల ఇమ్యూనిటీ ని పొందాడు. దాంతో ఆడాడు బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూ అయ్యే మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఇక మయా అస్త్ర అంటూ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వారికి టాస్క్ లు ఇచ్చారు. రకరకాల గేమ్స్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్. ఇక హౌస్ లో ఉన్న వారిని రెండు భాగాలుగా విడదీసి గేమ్ ఆడిస్తున్నారు. రణధీర, మహాబలి రెండు టీమ్స్ గా విడదీసి గేమ్స్ ఆడిస్తున్నారు బిగ్ బాస్.

మహాబలి పై రణధీర టీమ్ విన్ అయ్యింది. ఇక మయా అస్త్ర కీను సొంతం చేసుకున్నారు. అయితే ఈ గేమ్స్ ఆడుతున్న సమయంలోనే సంచలకుడిగా ఉన్న సందీప్ దగ్గరున్న పవర్ అస్త్ర ను దొంగిలించారు. నిజానికి ఈ దొంగతనం చేసింది శుభా శ్రీ. లగ్జరీ రూంలో ఉన్న ఆట సందీప్ పవరాస్త్రని కొట్టేసింది. ఇక సందీప్ అస్త్రాన్ని పోగొట్టుకొని హౌస్ లో హంగామా చేశాడు. నేడు విడుదలైన ప్రోమో చూస్తుంటే అర్ధమవుతుంది.

పవర్ అస్త్ర పోయిందని తెలుసుకున్న సందీప్ హౌస్ లో ఉన్న వాళ్లందరితో కలిసి వెతకడం మొదలు పెట్టాడు. చాలా చీప్ మెంటాలిటీ ఇది నా వస్తువును దొంగతనం చేశారు అనడంతో తేజ అలా అనొద్దు అంటూ వారించాడు. శుభ శ్రీ అని మహాబలి టీం సభ్యులందరికీ తెలుసు కానీ ఎవరికీ తెలియదు అన్నట్టు నాటకాలు ఆడారు. మహాబలి టీమ్ వాళ్ళే కొట్టేసుంటారని శోబాశెట్టి అనడంతో.. సెన్స్ ఉండి మాట్లాడు.. తెలియకుండా బ్లేమ్ చేయకు అంటూ రతిక ఫైర్ అయ్యింది.లగ్జరీ రూం రూంలోకి రావడానికి వాళ్లకి పర్మిషన్ లేదు.. నా పర్మిషన్ లేకుండా వాళ్లు హౌస్‌లోకి ఎలా వస్తారు.? అంటూ సందీప్ బిగ్ బాస్ ను అడిగాడు. ఇది న్యాయం కాదు బిగ్ బాస్ అంటూ తన ఆవేదన చెప్పుకున్నాడు సందీప్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.