Jawan- Allu Arjun: ‘షారుక్ మాస్ అవతార్’.. జవాన్ సినిమాను చూసిన అల్లు అర్జున్ ఇంకా ఏమన్నారంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతోంది. సెప్టెంబర్ 7న విడుదలైన పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు షారుక్ బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. టాలీవుడ్ నుంచి హీరో మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి జవాన్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జవాన్ సినిమాపై సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతోంది. సెప్టెంబర్ 7న విడుదలైన పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు షారుక్ బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. టాలీవుడ్ నుంచి హీరో మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి జవాన్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జవాన్ సినిమాపై సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘జవాన్’ చిత్రంలో భాగమైన నటీనటులు, టెక్నీషియన్లను బన్నీ అభినందించారు . ‘ముందుగా ఇంత పెద్ద హిట్ సొంతం చేసుకున్నందుకు జవాన్ చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. జవాన్ మూవీ పూర్తిగా షారుఖ్ మాస్ అవతార్. ఇందులో షారుఖ్ స్వాగ్ చూసి ఫిదా అయ్యాను. విజయ్ సేతుపతి ఎప్పటిలాగే తన పాత్రకు ప్రాణం పోశారు. నయనతార, దీపికా పదుకొణె నటన అద్భుతం. అనిరుధ్ రవిచందర్ పాటలు పదే పదే వినేలా చేసాడు. దర్శకుడు అట్లీ మనందరికీ గర్వకారణం. ఆలోచింపజేసే కమర్షియల్ సినిమా తీసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించినందుకు అతనికి అభినందనలు’ అని జవాన్ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘పుష్ప’లో నటనకు గాను జాతీయ అవార్డును అందుకున్నారాయన. దీంతో ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, డాలీ ధనంజయ్ తదితరులు నటిస్తున్నారు. ‘పుష్ప 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు15న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ పుష్ప2 సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక జవాన్ సినిమా విషయానికి వస్తే.. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 650 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం జవాన్ జోరు చూస్తుంటే 1000 కోట్లు వసూళ్లు చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. షారుక్ ఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై గౌరీఖాన్ జవాన్ సినిమాను నిర్మించారు. షారుక్, నయన్‌తో పాటు దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి, ప్రియమణి, సంజయ్ దత్, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవర్, సంజీత్ భట్టాచార్య తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
అల్లు అర్జున్ ట్వీట్
Biggg Congratulations to the whole team of #JAWAN for this mammoth blockbuster . Warm regards to the entire cast , technicians, crew & producers of #JAWAN @iamsrk garu’s Massiest avatar ever , charming the whole of India & beyond with his swag . Truly happy for you sir , we…
— Allu Arjun (@alluarjun) September 14, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..