Jawan: దూసుకుపోతున్న జవాన్.. వారం రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..
ఈ సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. రోజూ కోట్లాది రూపాయల వసూళ్లను రాబడుతోంది ఈ మూవీ. జవాన్ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతుంది. అయినా కూడా కలెక్షన్స్ విషయం లో దూసుకుపోతుంది ఈ మూవీ. ఇండియన్ మార్కెట్‌లో 7 రోజుల్లో రికార్డ్ స్థాయిలో కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో విడుదలైంది ఈ సినిమా. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ సక్సెస్ అందుకుంది జవాన్.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజాగా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ‘పఠాన్’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న షారుఖ్ ఇప్పుడు ‘జవాన్’ సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. రోజూ కోట్లాది రూపాయల వసూళ్లను రాబడుతోంది ఈ మూవీ. జవాన్ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతుంది. అయినా కూడా కలెక్షన్స్ విషయం లో దూసుకుపోతుంది ఈ మూవీ. ఇండియన్ మార్కెట్‌లో 7 రోజుల్లో రికార్డ్ స్థాయిలో కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో విడుదలైంది ఈ సినిమా. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ సక్సెస్ అందుకుంది జవాన్.
ఇక జవాన్ సినిమా వారం రోజులకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 386 కోట్ల రూపాయలు వసూల్ చేసిందని తెలుస్తోంది. ఇప్పటికే పఠాన్ సినిమాతో కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేసిన షారుఖ్ ఇప్పుడు జవాన్ తో ఆ రికార్డ్ ను బ్రేక్ చేయనున్నాడని అంటున్నారు ఫ్యాన్స్. జవాన్ సినిమా భారీ విజయం అందుకోవడంతో షారుఖ్ నెక్స్ట్ సినిమాల పై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే దర్శకుడు అట్లీకి పాన్-ఇండియా స్థాయిలో డిమాండ్ పెరిగింది. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో యాక్షన్ హీరోగా అభిమానులను అలరించాడు. ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే దీపికా పదుకొనె అతిథి పాత్రలో కనిపించింది. ఇక విజయ్ సేతుపతి ఈ మూవీలో విలన్ గా నటించారు.
‘జవాన్’ సినిమా తొలిరోజు భారీ ఓపెనింగ్స్ సాధించి వందల కోట్ల రూపాయలను వసూలు చేస్తోంది. షారుఖ్ ఖాన్‌కు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అభిమానులు ఉన్నారు. దాంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా కలెక్షన్స్ 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలను దాటేసింది. త్వరలో ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లను రాబడుతోంది ఇక రెండో వారం లోనూ ‘జవాన్’ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. అలాగే వినాయక చవితి కారణంగా సెలవులు కూడా ఈ సినిమాకు ప్లస్ అవ్వనున్నాయి. దాంతో జవాన్ కలెక్షన్ మరింత పెరుగుతుంది. మరి ఈ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందో చూడాలి . ‘ది వ్యాక్సిన్ వార్’, ‘చంద్రముఖి 2’ వంటి సినిమాలు సెప్టెంబర్ 28న విడుదల కానున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.