- Telugu News Photo Gallery Cinema photos Self made star Naveen Polishetty Cini journey and upcoming Movies update in Tollywood Telugu Heroes Photos
Naveen Polisetty: సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదుగుతున్న నవీన్ పోలిశెట్టి.. బిజీగా మారిన హీరో.
కొందరు నటులు ఇండస్ట్రీకి వచ్చినట్లు కూడా ఆడియన్స్‌కు గుర్తుండదు.. కానీ వాళ్లు మాత్రం చాలా సైలెంట్‌గా వచ్చిన పని మొదలు పెట్టి.. తమ మార్క్ క్రియేట్ చేస్తుంటారు.. అలాంటి నటుడే నవీన్ పొలిశెట్టి. పదేళ్ళ కిందే ఇండస్ట్రీకి వచ్చిన ఈ జాతిరత్నం వెలుగులు ఇప్పుడు టాలీవుడ్‌కు తెలుస్తున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో రేసులోకి వచ్చేసారు నవీన్. మరి ఈయన ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి..? అప్పుడెప్పుడో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన నటుడు నవీన్ పొలిశెట్టి..
Updated on: Sep 14, 2023 | 12:44 PM

కొందరు నటులు ఇండస్ట్రీకి వచ్చినట్లు కూడా ఆడియన్స్‌కు గుర్తుండదు.. కానీ వాళ్లు మాత్రం చాలా సైలెంట్‌గా వచ్చిన పని మొదలు పెట్టి.. తమ మార్క్ క్రియేట్ చేస్తుంటారు.. అలాంటి నటుడే నవీన్ పొలిశెట్టి.

పదేళ్ళ కిందే ఇండస్ట్రీకి వచ్చిన ఈ జాతిరత్నం వెలుగులు ఇప్పుడు టాలీవుడ్‌కు తెలుస్తున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో రేసులోకి వచ్చేసారు నవీన్. మరి ఈయన ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి..?

అప్పుడెప్పుడో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన నటుడు నవీన్ పొలిశెట్టి.. కానీ అది ఈ కుర్రాడి కెరీర్‌కు యూజ్ కాలేదు. దాంతో సినిమాల కంటే ముందే యూ ట్యూబ్ వీడియోలతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు.

చిచోరే సినిమాతో నార్త్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు.. ఇక ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయతో టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్. సాయి శ్రీనివాస ఆత్రేయకు కథ, స్క్రీన్ ప్లే అన్నీ నవీన్ రాసుకున్నారు.

ఇక జాతి రత్నాలుతో మరో బ్లాక్‌బస్టర్ అందుకుని క్రేజ్ డబుల్ చేసుకున్నారు ఈ హీరో. అనుదీప్ కేవీ తెరకెక్కించిన జాతి రత్నాలు కామెడీ సినిమాలకు కల్ట్ అయిపోయింది. దాని తర్వాత భారీ గ్యాప్ తీసుకుని.. ఈ మధ్యే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో మరోసారి మ్యాజిక్ చేసారీయన. దీనికీ కలెక్షన్లు అదిరిపోతున్నాయి.

అనుష్క శెట్టితో ఇందులో జోడీ కట్టారు నవీన్. ఈ సినమా విజయానికి నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ ప్రధానమైన కారణం. ముఖ్యంగా వన్ లైనర్స్‌తో కడుపులు చెక్కలయ్యేలా నవ్వించారు నవీన్.

స్క్రిప్ట్స్ కూడా చాలా సెలెక్టివ్‌గా చూసుకుంటూ.. క్లీన్ సినిమాలతో విజయాలందుకుంటుకున్నారు నవీన్. ప్రస్తుతం అనగనగనా ఒకరాజుతో పాటు మరో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారీయన.





























