Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy Vijay : ‘నాన్నకు ప్రేమతో’.. తండ్రికి హార్ట్‌ సర్జరీ.. పంతాలను పక్కనెట్టి ఇంటికెళ్లిన విజయ్

విజయ్‌కు, ఆయన తండ్రి చంద్రశేఖర్‌ మద్య కొన్ని విబేధాలు ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య గొడవలు తలెత్తాయి. విజయ్‌కు తెలియకుండా చంద్రశేఖర్‌.. ఆయన పేరుతో పొలిటికల్‌ పార్టీ ఆఫీస్‌ పెట్టడం, ఇది విజయ్‌కు నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. తండ్రి మీదనే పోలీస్‌ కేసు పెట్టాడని వార్తలు వచ్చాయి

Thalapathy Vijay : 'నాన్నకు ప్రేమతో'.. తండ్రికి హార్ట్‌ సర్జరీ.. పంతాలను పక్కనెట్టి ఇంటికెళ్లిన విజయ్
Vijay Thalapathy Family
Follow us
Basha Shek

|

Updated on: Sep 14, 2023 | 12:52 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేక పరిచయం లేదు. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటోన్న హీరోల్లో విజయ్‌ కూడా ఒకరు. బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో కోట్లాది రూపాయల పారితోషకం అందుకుంటున్నాడీ స్టార్‌ హీరో. అంతకుమించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తనకు మాస్టర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇచ్చిన లోకేష్‌ కనగరాజ్‌తో ‘లియో’ అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్‌. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చాలా భాగం పూర్తయ్యింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. విజయ్‌కు, ఆయన తండ్రి చంద్రశేఖర్‌ మద్య కొన్ని విబేధాలు ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య గొడవలు తలెత్తాయి. విజయ్‌కు తెలియకుండా చంద్రశేఖర్‌.. ఆయన పేరుతో పొలిటికల్‌ పార్టీ ఆఫీస్‌ పెట్టడం, ఇది విజయ్‌కు నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. తండ్రి మీదనే పోలీస్‌ కేసు పెట్టాడని వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య విభేదాలపై అటు విజయ్‌ కానీ, ఇటు చంద్రశేఖర్‌ ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. మరోవైపు తండ్రి విషయంలో విజయ్‌పై తరచూ కొన్ని విమర్శలు వస్తూనే ఉన్నాయి.

చాలా రోజుల తర్వాత తల్లిదండ్రులతో..

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వారసుడు సినిమాలో తండ్రి సెంటిమెంట్ గురించి హీరో మాట్లాడినప్పుడు కూడా అతనిపై విమర్శలు వచ్చాయి. నిజజీవితంలో తల్లిదండ్రులను పక్కన పెట్టిన విజయ్‌.. రీల్‌ లైఫ్‌లో మాత్రం బాగానే డైలాగులు చెబుతున్నాడంటూ కొందరు నెగెటివ్‌ కామెంట్లు చేశారు.  కాగా విజయ్‌ తండ్రి గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విజయ్‌ తండ్రితో తన పంతాలు, గొడవలను పక్కన పెట్టేశాడు. చంద్రశేఖర్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అమెరికా నుంచి రెండు రోజుల క్రితమే చెన్నైకి వచ్చిన విజయ్‌ వెంటనే తన తండ్రి ఇంటికెళ్లాడు. ఆయనను పరామర్శించాడు. ఇక చాలా రోజుల తర్వాత కుమారుడు ఇంటికి రావడంతో విజయ్‌కు ఇష్టమైన వంటకాలను రెడీ చేయించారట. ఇదే సందర్భంగా తన తల్లిదండ్రులతో కలిసి ఫొటోలు దిగాడు విజయ్‌.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. చాలా రోజుల తర్వాత పేరెంట్స్‌తో విజయ్‌ కనిపించడంతో అతని అభిమానులు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక విజయ్‌ నటిస్తోన్న లియో సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. సంజయ్‌ దత్‌, అర్జున్‌దాస్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, మిస్కిన్‌, ప్రియా ఆనంద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్‌ 19న ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..