AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: కశ్మీర్ ఎన్‌కౌంటర్‌.. పాక్‌ క్రికెటర్లతో ఆ చనువేంటంటూ కోహ్లీపై ట్రోల్స్‌.. కౌంటరిచ్చిన బీసీసీఐ

అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భారత ఆర్మీ అధికారులు, ఒక జమ్మూకశ్మీర్ పోలీసు అధికారితో సహా మొత్తం నలుగురు వీరమరణం పొందారు. ఈ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా పాకిస్థాన్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇటీవల పాక్‌తో మ్యాచ్ అనంతరం బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్‌తో సరదాగా మాట్లాడిన విరాట్ కోహ్లీని కొందరు ట్రోల్ చేస్తున్నారు.

IND vs PAK: కశ్మీర్ ఎన్‌కౌంటర్‌.. పాక్‌ క్రికెటర్లతో ఆ చనువేంటంటూ కోహ్లీపై ట్రోల్స్‌.. కౌంటరిచ్చిన బీసీసీఐ
Virat Kohli
Basha Shek
|

Updated on: Sep 15, 2023 | 12:07 PM

Share

కశ్మీర్‌లోని అనంత‌నాగ్‌లో ఉగ్ర‌వాద దాడి జ‌రిగిన త‌ర్వాత కొందరు నెటిజన్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డ్, ఇండియ‌న్ క్రికెట‌ర్లను టార్గెట్ చేసుకున్నారు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు స్నేహపూర్వకంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడుతున్నందుకు బీసీసీఐ, భారత ఆటగాళ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్థాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాద కార్యకలాపాలను నిరంతరం కొనసాగిస్తోందని, అలాంటి పరిస్థితుల్లో భారత్ పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడకూడదని చాలా మంది టీమిండియాపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అనంత్‌నాగ్‌లో జరిగిన దాడిని రాజీవ్ శుక్లా తీవ్రంగా ఖండించారు. అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భారత ఆర్మీ అధికారులు, ఒక జమ్మూకశ్మీర్ పోలీసు అధికారితో సహా మొత్తం నలుగురు వీరమరణం పొందారు. ఈ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా పాకిస్థాన్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇటీవల పాక్‌తో మ్యాచ్ అనంతరం బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్‌తో సరదాగా మాట్లాడిన విరాట్ కోహ్లీని కొందరు ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా ఈ విషయంపై మాట్లాడిన రాజీవ్ శుక్లా ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. టెర్రరిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గత 20 ఏళ్లలో ప్రతి ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరాడిందన్నారు. పాకిస్థాన్‌కు సూచనలు ఇస్తూ, పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, అందుకే ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం తమకు లేదా ప్రపంచానికి మంచిది కాదని రాజీవ్ శుక్లా అన్నారు. దీని తర్వాత రాజీవ్ మాట్లాడుతూ, క్రికెట్‌కు సంబంధించినంతవరకు, ఈ విషయంలో పాకిస్తాన్‌తో భారత్ ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని స్పష్టమైన విధానం ఉందని చెప్పాడు. గత 11 ఏళ్లుగా భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఆగిపోయింది. ఈ రెండు జట్లు ఆసియా కప్ లేదా ప్రపంచకప్‌లో మాత్రమే తలపడతాయి. చివరిసారిగా 2012లో భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాయి. ఆ తర్వాత పాకిస్థాన్ భారత్‌లో పర్యటించింది . అయితే దీని తర్వాత ఏ జట్టు కూడా పాక్‌లో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌కు కూడా పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాల్సింది. అయితే భద్రతా కారణాలతో పాకిస్థాన్‌కు పంపబోమని బీసీసీఐ స్పష్టంగా తిరస్కరించడంతో ఆసియా కప్ మ్యాచ్‌లు చాలా వరకు శ్రీలంకలోనే జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా రియాక్షన్ ఇదే..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..