AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prema Vimanam OTT: డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్‌ కానున్న ‘ప్రేమ విమానం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హీరో సంతోష్‌ శోభన్‌ తమ్ముడి ట్యాగ్‌తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సంగీత్ శోభన్‌. వరుసగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. పిట్టకథలు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, ద బేకర్‌ అండ్‌ ద బ్యూటీ వెబ్‌ సిరీసుల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రేమ విమానం అనే ఓ ఫీల్‌గుడ్‌ సినిమాలో నటిస్తున్నాడు సంగీత్‌ శోభన్‌.

Prema Vimanam OTT: డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్‌ కానున్న 'ప్రేమ విమానం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Prema Vimanam Movie
Basha Shek
|

Updated on: Sep 16, 2023 | 4:21 PM

Share

హీరో సంతోష్‌ శోభన్‌ తమ్ముడి ట్యాగ్‌తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సంగీత్ శోభన్‌. వరుసగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. పిట్టకథలు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, ద బేకర్‌ అండ్‌ ద బ్యూటీ వెబ్‌ సిరీసుల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రేమ విమానం అనే ఓ ఫీల్‌గుడ్‌ సినిమాలో నటిస్తున్నాడు సంగీత్‌ శోభన్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శాన్వీ మేఘన కథానాయికగా నటించంది. అలాగే చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ ఫిల్మ్‌కి సంతోష్ కటా దర్శకత్వం వహించారు. విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు చిన్న పిల్లలు .. కొత్త జీవితం కోసం విమానం ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంట.. వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన ఘటనలు.. వారి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చేతుల మీదుగా ఇటీవల రిలీజైన అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ప్రేమ విమానం డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. అక్టోబర్ 13న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 లో ఈ ఫీల్‌గుడ్‌ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా పని చేశారు. అమర్ రెడ్డి ఎడిటర్‌గా, ఆర్ట్ డైరెక్టర్‌గా గంధి నడికుడికర్ వ్యవహరిస్తున్నారు. కాగా జీ5లో ఇప్పటివరకు స్ట్రీమింగ్‌కు వచ్చిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అ లూసర్ 2, గాలివాన, రెక్కి, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంగ్, అహనా పెళ్లంట, ఏటీఎం, పులి మేక తదితర వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకన్నాయి. ఇదే కోవలో అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి నిర్మించిన ‘ప్రేమ విమానం’ కూడా సక్సెస్‌ అవుతుందంటున్నారు మేకర్స్‌.

జీ5 లో స్ట్రీమింగ్..

View this post on Instagram

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

సంగీత్ శోభన్ లేటెస్ట్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..