Bigg Boss 7 Telugu: ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది తనే.. డేంజర్‌ జోన్‌లో ఆ ఇద్దరు కూడా.. ఓటింగ్‌ రిజల్ట్‌ ఇదే!

ప్రముఖ టీవీ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే రెండో వారం కూడా పూర్తికావొచ్చింది. హౌజ్‌మేట్స్‌ ఎవరూ తగ్గకుండా టాస్కులు, గేమ్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. కాగా బిగ్‌బాస్‌ మొదటివారంలో ప్రముఖ నటి కిరణ్‌ రాథోడ్‌ ఎలిమినేట్ అయ్యింది. తెలుగు రాకపోవడం, సరిగా టాస్కుల్లో పాల్గొనకపోవడం, పూర్‌ ఓటింగ్‌ ఆమె ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి. మరి ఈ వారం ఎలిమినేట్‌ అవుతారన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

Bigg Boss 7 Telugu: ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది తనే.. డేంజర్‌ జోన్‌లో ఆ ఇద్దరు కూడా.. ఓటింగ్‌ రిజల్ట్‌ ఇదే!
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Sep 16, 2023 | 5:39 PM

ప్రముఖ టీవీ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే రెండో వారం కూడా పూర్తికావొచ్చింది. హౌజ్‌మేట్స్‌ ఎవరూ తగ్గకుండా టాస్కులు, గేమ్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. కాగా బిగ్‌బాస్‌ మొదటివారంలో ప్రముఖ నటి కిరణ్‌ రాథోడ్‌ ఎలిమినేట్ అయ్యింది. తెలుగు రాకపోవడం, సరిగా టాస్కుల్లో పాల్గొనకపోవడం, పూర్‌ ఓటింగ్‌ ఆమె ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి. మరి ఈ వారం ఎలిమినేట్‌ అవుతారన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ వీక్ నామినేషన్స్‌లో శివాజీ, పల్లవి ప్రశాంత్, రతిక, టేస్టీ తేజా, షకీలా, గౌతమ్‌ కృష్ణ, శోభాశెట్టి, అమర్‌దీప్‌, ప్రిన్స్‌ యావర్‌.. ఇలా మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీకెండ్ రావడంతో గత రెండు రోజుల నుంచి ఎలిమినేషన్స్‌, వైల్డ్‌ కార్డ్ ఎంట్రీపై నెట్టింట వార్తలు తెగ వైరలవుతున్నాయి. అలాగే ఓటింగ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పటిలాగే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ ఓటింగ్‌లో అదరగొడుతున్నాడు. సో.. ఈ వారం అతను సేఫ్‌ అని తెలుస్తోంది. ఇక రెండో స్థానంలో ఉన్న శివాజీ ఉన్నాడని తెలుస్తోంది. మూడో స్థానంలో అమర్‌ దీప్‌, రతిక నాలుగో స్థానంలో ఉన్నారని సమాచారం. అయితే ఈ వారం ఎలిమినేషన్‌ హిట్‌ లిస్టులో ఉన్న ప్రిన్స్‌ యావర్‌కు అనూహ్యంగా మద్దతు పెరిగింది. శుక్రవారం (సెప్టెంబర్‌15) జరిగిన ఎపిసోడ్‌తో ప్రిన్స్‌కు భారీగా ఓట్లు పోలయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఐదో స్థానంలో ఉండడంతో ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకున్నట్లే.

డేంజర్‌ జోన్‌లో కార్తీక దీపం బ్యూటీ..

ఇక రెండో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో టేస్టీ తేజా, గౌతమ్ కృష్ణ వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. అయితే ఈ సీజన్‌లో టాప్ కంటెస్టెంట్లలో ఒకరైన శోభాశెట్టికి తక్కువగా ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె 8వ స్థానంలో ఉంది. ఇక చివరి స్థానంలో సీనియర్‌ నటి షకీలా ఉంది. అంటే ప్రస్తుతం శోభాశెట్టి, షకీలా డేంజర్‌ జోన్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక శోభాశెట్టికి ఉన్న క్రేజ్‌ కారణంగా ఈ వారం ఆమె ఎలిమినేషన్‌ కాకపోవచ్చని తెలుస్తోంది. సో.. షకీలానే ఈ వారం నుంచి బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వెళ్లవచ్చని తెలుస్తోంది. దీనికి తోడు ఈ సీనియర్‌ నటి యాక్టివ్‌గా టాస్కులు ఆడడం లేదు. నిజ జీవితంలో ఉన్నట్లుగానే బిగ్‌బాస్‌లోనూ ఎంతో సింపుల్‌గా ఉంటుంది. బిగ్‌బాస్‌ లో ఉండాలంటే ఈ క్వాలిటీస్‌ ఏ మాత్రం సరిపోవని, అందుకే షకీలాను సాగనంపేందుకు బిగ్‌బాస్‌ రెడీ అయ్యాడని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

 బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..