Bigg Boss 7 Telugu: ఎలిమినేషన్‏లో భారీ ట్విస్ట్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న మరో సీరియల్ హీరో.. ఎవరంటే..

నిన్నటి ఎపిసోడ్‎లో గౌతమ్, ప్రిన్స్ యావర్ మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ కొట్టుకుంటారేమో అన్నట్లుగా ప్రవర్తించారు. మరోవైపు గత రెండు రోజులుగా తన ఆట తాను ఆడుకుంటూ సైలెంట్ అయిన రైతు బిడ్డ ప్రశాంత్.. రతిక ఆటను కట్టడి చేశాడు. ఆమె ఆట తీరును చెప్పే మాటలను డైరెక్ట్‎గా ప్రశ్నించాడు. ఫుటేజీ కోసం రతిక చేసే పిచ్చి పనులు హౌస్మేట్స్ కనిపెట్టేశారు.

Bigg Boss 7 Telugu: ఎలిమినేషన్‏లో భారీ ట్విస్ట్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న మరో సీరియల్ హీరో.. ఎవరంటే..
Bigg Boss 7 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 16, 2023 | 9:34 AM

బిగ్‏బాస్ సీజన్ 7 తెలుగు రెండో వారం హాట్ హాట్ గా సాగుతోంది. గొడవలు.. అరుచుకోవడాలు కాదు.. ఈ సీజన్ ఏకంగా బూతు పురణాలకు అడ్డగా మారింది. తిట్టుకోవడం కాదు.. కొట్టుకోవడానికి కూడా రెడీ అన్నట్లుగా కంటెస్టెంట్స్ ప్రవర్తిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‎లో గౌతమ్, ప్రిన్స్ యావర్ మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ కొట్టుకుంటారేమో అన్నట్లుగా ప్రవర్తించారు. మరోవైపు గత రెండు రోజులుగా తన ఆట తాను ఆడుకుంటూ సైలెంట్ అయిన రైతు బిడ్డ ప్రశాంత్.. రతిక ఆటను కట్టడి చేశాడు. ఆమె ఆట తీరును చెప్పే మాటలను డైరెక్ట్‎గా ప్రశ్నించాడు. ఫుటేజీ కోసం రతిక చేసే పిచ్చి పనులు హౌస్మేట్స్ కనిపెట్టేశారు. దీంతో ఒక్కొక్కరుగా ఆమెను నేరుగానే కౌంటరిస్తున్నారు. రోజు రోజుకు ఈ అమ్మడు పాపులారిటీ మాత్రం పడిపోతున్నట్లుగానే తెలుస్తోంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో తొమ్మిది మంది ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీకెండ్ వచ్చేసింది.

అయితే ఈసారి బిగ్‏బాస్ ఎలిమినేషన్స్‏లో భారీ ట్విస్ట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈవారం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ను ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూంకు పంపుతారని టాక్ వినిపిస్తోంది. దీంతో అతడికి స్క్రీన్ స్పేస్ మరింత ఎక్కువవడం ఖాయం. అంతేకాదు.. సీక్రెట్ రూంలోకి పంపిన తర్వాత అతడికి హౌస్మేట్స్ ఆట తీరు తెలుసుకోవడంతో.. ఆ తర్వాత ఆట తీరులో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ఇదిలా ఉంటే.. ప్రశాంత్ ను ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూంకు పంపడమే కాకుండా.. ఈసారి హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండనున్నట్లు తెలుస్తోంది. అగ్ని సాక్షి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయిన అర్జున్ అంబటి ఈవారం హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముందే అర్జున్ బిగ్‏బాస్ లోకి అడుగుపెట్టనున్నారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కేవలం 14 మంది మాత్రమే ఈసారి ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు అర్జున్ వైల్డ్ కార్డ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈరోజు ఏం జరగబోతుందనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాలి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?