Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ప్రిన్స్ యావర్ గుండెల్లో తీరని బాధ.. అమ్మను తలుచుకుని గుక్కపట్టి ఏడుస్తూ..

బిగ్‏బాస్ హీరోలు గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ మధ్య తీవ్రస్తాయిలో గొడవ జరగ్గా.. గౌతమ్ నిర్ణయానికి ప్రిన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో కష్టపడినా ఆట ఆడినప్పటికీ అన్యాయం జరిగిందంటూ ఏడ్చేశాడు. పవర్ అస్ర్త గెలుచుకోవడానికి చివరగా షకీలా, శివాజీ నిలవగా మరొకరిని సెలక్ట్ చేయాలని బిగ్‏బాస్ ఆదేశించడం.. వెంటనే అమర్ దీప్ ను సందీప్ సెలక్ట్ చేయడంతో షకీలా , శివాజీ బిగ్‏బాస్ పై విరుచుకుపడ్డారు.

Bigg Boss 7 Telugu: ప్రిన్స్ యావర్ గుండెల్లో తీరని బాధ.. అమ్మను తలుచుకుని గుక్కపట్టి ఏడుస్తూ..
Prince Yawar
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 15, 2023 | 10:00 PM

బిగ్‏బాస్ సీజన్ 7 తెలుగు సీజన్ రెండో వారం అంతా గొడవలతో నడుస్తోంది. పవర్ అస్త్ర కోసం కంటెస్టెంట్స్ అంతా ఒకరినొకరు దూషించుకుంటున్నారు. మరికొందరు మాటలతో రెచ్చిపోతుండగా.. ఇంకొందరు ఏడ్చేస్తున్నారు. అంతా సైలెంట్ అనకుంటున్న సమయంలో మరో రచ్చ స్టార్ట్ చేస్తున్నారు బిగ్‏బాస్. ఇక ఈరోజు రిలీజ్ చేసిన ప్రోమోలలో రతిక, దామిని మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక బిగ్‏బాస్ హీరోలు గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ మధ్య తీవ్రస్తాయిలో గొడవ జరగ్గా.. గౌతమ్ నిర్ణయానికి ప్రిన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో కష్టపడినా ఆట ఆడినప్పటికీ అన్యాయం జరిగిందంటూ ఏడ్చేశాడు. పవర్ అస్ర్త గెలుచుకోవడానికి చివరగా షకీలా, శివాజీ నిలవగా మరొకరిని సెలక్ట్ చేయాలని బిగ్‏బాస్ ఆదేశించడం.. వెంటనే అమర్ దీప్ ను సందీప్ సెలక్ట్ చేయడంతో షకీలా , శివాజీ బిగ్‏బాస్ పై విరుచుకుపడ్డారు.

ఇదిలా ఉంటే.. బిగ్‏బాస్ మొదటి రోజు నుంచి ప్రిన్స్ యావర్ స్పెషల్ అట్రాక్ట్ అవుతున్నారు. మొదటి రోజే కండలు చూపిస్తూ ఇళ్లంతా తిరిగేస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు. అలాగే తెలుగులో మాట్లాడేందుకు కాస్త ఎక్కువగానే ట్రై చేస్తున్నాడు. అయితే తాజాగా తన తల్లి గురించి చెబుతూ ప్రిన్స్ ఏడ్చిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం ప్రిన్స్ యావర్ బిగ్‏బాస్ హౌస్ లో ఉండగా.. అతని ఇన్ స్టా ఖాతాను తన పీఆర్ఓ టీం మెయిన్ టెన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రిన్స్ ఇన్ స్టా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ప్రిన్స్ తన తల్లిని తలుచుకుని ఏడ్చేశాడు.

View this post on Instagram

A post shared by Prince Yawar (@princeyawar)

అందులో జీవితంలో నువ్వు బాధపడిన పరిస్థితి ఏంటీ ? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ప్రిన్స్ స్పందిస్తూ.. “మా అమ్మ చనిపోయినప్పుడు” అంటూ గుక్కపట్టి ఏడ్చేశాడు యావర్. అతడిని కంట్రోల్ చేయడానికి యాంకర్ ప్రయత్నించినా.. ప్రిన్స్ అమ్మను తలుచుకుంటూ ఏడుస్తూ ఉండిపోయాడు. అమ్మ నువ్వే లేని లోటు చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. నువ్వు లేని ప్రతి క్షణం నాకు శూన్యంలా ఉంది. నీ నవ్వు, నువ్వు పంచిన ప్రేమను చాలా మిస్ అవుతున్నాను. నువ్వు వదిలి వెళ్లిన జ్ఞాపకాల చీకట్లో నీ ప్రేమనే వెలుతురుగా చేసుకుని తిరుగుతున్నాను. నీ ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. నువ్వు నా వెలకట్టలేని ఆస్తివి అంటూ రాసుకొచ్చారు.

View this post on Instagram

A post shared by Prince Yawar (@princeyawar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో
రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో
సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??
సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?