Faima: ఫైమా కల తీరింది.. అమ్మానాన్నలతో కలసి కొత్తింట్లోకి అడుగుపెట్టింది.. అభిమానులతో పంచుకున్న సంతోషం..
ఫైమా తన కలను బిగ్ బాస్ వేదికపై బయటపెట్టింది. తన తల్లిదండ్రుల గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చింది. బీడీలు చుట్టి అలా వచ్చిన డబ్బుతో తమను పెంచిందని ... తన అమ్మానాన్నలకు సొంతిల్లు కట్టివ్వాలనేదే తన కోరిక అని తెలిపింది. ఇప్పుడు తన కోరికను నిజం చేసుకుంది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసింది. అంతేకాదు.. తన తండ్రితో కలిసి ఎంతో సంతోషంగా కొత్తింట్లోకి అడుగుపెట్టింది.
జబర్ధస్త్ ఫైమా.. ఈపేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఓ కాలేజీ విద్యార్థిగా పటాస్ కామెడీ షో చూసేందుకు వెళ్లిన ఫైమా.. తన అల్లరి.. చలాకీతనంతో ఆ షోలోనే పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ అయ్యింది. ఈ షోలో తన కామెడీ టైమింగ్ .. పంచులతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. ఫైమా కామెడీ కోసం జబర్దస్త్ చూసే అడియన్స్ ఉన్నారంటే అతిశయోక్తి లేదు. అంతగా తన కామెడీతో బుల్లితెరపై ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 6లోకి అడుగుపెట్టింది. అక్కడ దాదాపు 10 వారాలు ఉండి తన గేమ్‌తో అలరించింది. టాస్కులలో అబ్బాయిలకు గట్టిపోటినిచ్చింది. అలాగే తన కామెడీతో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడానికి ఫైమా ఎన్నో ఒడిదుడుకులు.. ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన కష్టాలను.. మాటలను చాలాసార్లు తన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చింది.
అయితే ఫైమా తన కలను బిగ్ బాస్ వేదికపై బయటపెట్టింది. తన తల్లిదండ్రుల గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చింది. బీడీలు చుట్టి అలా వచ్చిన డబ్బుతో తమను పెంచిందని … తన అమ్మానాన్నలకు సొంతిల్లు కట్టివ్వాలనేదే తన కోరిక అని తెలిపింది. ఇప్పుడు తన కోరికను నిజం చేసుకుంది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసింది. అంతేకాదు.. తన తండ్రితో కలిసి ఎంతో సంతోషంగా కొత్తింట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫైమా గృహ ప్రవేశం వీడియో వైరలవుతుంది. అందులో ఫైమాను పట్టుకుని ఆమె తల్లి కన్నీరు పెట్టుకుంది. ఫైమా గృహప్రవేశ వేడుకకు జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్, బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే సూర్య తదితరులు హజరయ్యారు.
View this post on Instagram
ప్రస్తుతం బుల్లితెరపై పలు కామెడీ షోలలో సందడి చేస్తుంది ఫైమా. అలాగే బీబీ జోడి షోలో సూర్యతో కలిసి పాల్గొని విన్నర్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం స్టార్ మాలో వస్తో్న్న పలు షోలలో పాల్గొంటూ తనదైన కామెడీతో అలరిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.