Bigg Boss 7 Telugu: మరో ప్రేమకథ మొదలు.. ఈసారి ప్రశాంత్ ముందే అతడితో పులిహోర కలిపేస్తోన్న రతిక..

రెండో వారంలో ఇంట్లో మాయాస్త్రాల గురించి పోటీ జరుగుతుంది. మాయాస్త్రాలను దక్కించుకునేందుకు రణధీర, మహాబలి టీమ్స్ పోటీ పడ్డాయి. ఇందులో రణధీర టీమ్ గెలిచింది. అయితే టాస్క్ లో భాగంగా ప్రిన్స్, గౌతమ్ తీవ్రంగా గొడవపడ్డారు. పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఒకరిపైకి మరొకరు వెళ్లారు. దీంతో హౌస్మేట్స్ మధ్యలో కలగచేసుకుని వారిద్దరిని వారించారు. అయితే తనకు ఇంట్లో అన్యాయం జరిగిందంటూ ప్రిన్స్ ఏడ్చేశాడు. అనంతరం అతడిని కన్ఫెషన్ రూంకు పిలిచారు బిగ్‏బాస్.

Bigg Boss 7 Telugu: మరో ప్రేమకథ మొదలు.. ఈసారి ప్రశాంత్ ముందే అతడితో పులిహోర కలిపేస్తోన్న రతిక..
Bigg Boss 7 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 15, 2023 | 6:08 PM

Bigg Boss 7 Telugu: మళ్లీ స్టార్ట్ చేసిన రతిక.. ఈసారి ప్రశాంత్ ముందే అతడితో పులిహోర కలిపేస్తోంది.. బిగ్‏బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అన్నట్లుగానే సాగుతుంది. మొదటి వారం నుంచే ఇంట్లో గొడవలు.. లవ్ ట్రాక్స్.. గాసిప్స్ బయటపడిన సంగతి తెలిసిందే. ఓవైపు పల్లవి ప్రశాంత్, రతిక మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ ఇంట్లో సభ్యులే బిగ్‏బాస్ ముందు చెప్పేయగా.. ఆ తర్వాత శుభ శ్రీ, గౌతమ్ కృష్ణ అంటూ చెప్పుకొచ్చారు. అయితే రెండో వారం నామినేషన్స్ లో హౌస్మేట్స్ అంతా పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేసి మరీ నామినేట్ చేశారు. రైతు బిడ్డ ట్యాగ్ ఉందని.. రతికతో ఉంటున్నావంటూ ఆరోపించారు. అయితే అదే సమయంలో అప్పటివరకు ప్రశాంత్ వెంటే ఉన్న రతిక.. ఒక్కసారిగా ప్లేట్ తిప్పేసింది. ఇన్నాళ్లు ఛాన్స్ కోసం బయట తిరిగిన నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావంటూ అతడికే రివర్స్ కౌంటర్ ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్లుగానే తెలుస్తోంది. నామినేషన్స్ తర్వాత తన ఆటపై ఫోకస్ పెట్టిన ప్రశాంత్.. రతికకు కాస్త దూరంగానే ఉంటున్నాడు. ఇక రెండో వారంలో ఇంట్లో మాయాస్త్రాల గురించి పోటీ జరుగుతుంది. మాయాస్త్రాలను దక్కించుకునేందుకు రణధీర, మహాబలి టీమ్స్ పోటీ పడ్డాయి. ఇందులో రణధీర టీమ్ గెలిచింది. అయితే టాస్క్ లో భాగంగా ప్రిన్స్, గౌతమ్ తీవ్రంగా గొడవపడ్డారు. పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఒకరిపైకి మరొకరు వెళ్లారు. దీంతో హౌస్మేట్స్ మధ్యలో కలగచేసుకుని వారిద్దరిని వారించారు. అయితే తనకు ఇంట్లో అన్యాయం జరిగిందంటూ ప్రిన్స్ ఏడ్చేశాడు. అనంతరం అతడిని కన్ఫెషన్ రూంకు పిలిచారు బిగ్‏బాస్.

ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో గార్డెన్ ఏరియాలో ప్రిన్స్ రతికతో మాట్లాడుతూ కనిపించాడు. రతిక, శివాజీ, ప్రశాంత్ గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉండగా.. ప్రిన్స్ నేలపై పడుకున్నాడు. బిగ్‏బాస్ తో మాట్లాడి వచ్చిన తర్వాత చల్లబడ్డాడు అని రతిక అనగా.. ఐ లైక్ యూ రతిక అంటూ చెప్పుకొచ్చారు. ఇక రతిక మాటలకు పొంగిపోయాడు యావర్. వీరిద్దరి ముచ్చట అక్కడ ప్రశాంత్ ముందే జరిగింది.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ఇదిలా ఉంటే.. పవర్ అస్త్ర కోసం మహాబలి టీంలో షకీలా, శివాజీ అర్హులని అందరూ నిర్ణయించగా.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన బిగ్‏బాస్.. సందీప్ ను మరో వ్యక్తిని ఎంచుకోమన్నారు. దీంతో అతడు అమర్ దీప్ ను సెలక్ట్ చేశాడు. దీంతో శివాజీ, షకీలా అసహనం వ్యక్తం చేశారు. ఇంట్లో నుంచి వెళ్లిపోతామని కేకలు పెట్టారు. అలాగే.. కిచెన్ దగ్గర సందీప్, యావర్ మధ్య మరోసారి గొడవ జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.