BIGG BOSS Season 7 Highlights : ఆట ఆడు.. మనుషులతో ఆడుకోకు.. రతికకు బిగ్ వార్నింగ్ ఇచ్చిన నాగ్.. రైతు బిడ్డ పరువు కూడా పోయే..
BIGG BOSS Season 7 Highlights : రోజూ పప్పన్నమో.. కాయగూర అన్నమో రుచి చూసిన నాలుకకు.. వీకెండ్ వస్తే.. కక్క ముక్క ఎలా ఉండాలో.. బిగ్ బాస్ చూసే వాళ్లకు కాడా.. వీకెండ్‌లో నాగ్ షో అలాగే ఉండాలి. ఆయన ఫుల్ ఎనర్జటిక్తో రావాలి.. కంటెస్టెంట్స్ చేసే తప్పొప్పులను బేరీజు వేయాలి. మెచ్చుకోవాలి.. వీలైతే గట్టిగా తిట్టిపోవాలి. అప్పుడే కదా కిక్కిచ్చే ఎంటర్‌టైన్మెంట్ అందరికీ...! ఇక తాజాగా బిగ్ బాస్ డే 13th, 14th ఎపిసోడ్ కూడా అచ్చం ఇలానే సాగింది.
BIGG BOSS Season 7 Highlights : రోజూ పప్పన్నమో.. కాయగూర అన్నమో రుచి చూసిన నాలుకకు.. వీకెండ్ వస్తే.. కక్క ముక్క ఎలా ఉండాలో.. బిగ్ బాస్ చూసే వాళ్లకు కాడా.. వీకెండ్‌లో నాగ్ షో అలాగే ఉండాలి. ఆయన ఫుల్ ఎనర్జటిక్తో రావాలి.. కంటెస్టెంట్స్ చేసే తప్పొప్పులను బేరీజు వేయాలి. మెచ్చుకోవాలి.. వీలైతే గట్టిగా తిట్టిపోవాలి. అప్పుడే కదా కిక్కిచ్చే ఎంటర్‌టైన్మెంట్ అందరికీ…! ఇక తాజాగా బిగ్ బాస్ డే 13th, 14th ఎపిసోడ్ కూడా అచ్చం ఇలానే సాగింది. కంటెస్టెంట్స్ అసెస్‌మెంట్లు.. వాళ్లు చేసిన చీటింగ్‌లు.. ఇన్‌డైరెక్ట్ అండ్ డైరెక్ట్ వార్నింగ్లు.. పనిష్మెంట్లు.. వెరసి.. తాజాగా నాగ్ వీకెండ్ ఎపిసోడ్.. బిగ్ బాస్ లవర్స్‌నే కాదు.. నాన్ బిగ్ బాస్ లవర్స్‌ను కూడా విపరీతంగానే ఎంటర్‌టైన్ చేసింది.
ఇక ఈ షో బిగినింగ్‌లో.. చిరు భోళా శంకర్ సినిమాలోని జామ్ జామ్ జజ్జనక సాంగ్‌తో వెరీ ఎనర్జిటిక్‌గా ఎంట్రీ ఇచ్చిన కింగ్.. తన డ్యాన్స్‌తో అందర్నీ అరిపించేస్తాడు. ఆ తరువాత ఎప్పటిలాగే.. శుక్రవారం హౌస్‌లో ఏం జరిగిందో.. తను చూస్తూనే మనకు చూపించేస్తాడు. ఓ పక్క రితిక ప్రిన్స్ యావర్ మాటలను.. మరో పక్క సుబ్బు.. గౌతమ్ కృష్ణల మధ్య జరుగుతున్న చిన్న పాటి ఫన్నీ రొమాన్స్‌ను చూస్తూ.. నాగ్ నవ్వుకుంటారు. నాగ్ మాత్రమే కాదు.. వీకెండ్ షోలో ఉన్న ఆడియెన్స్ కూడా.. గౌతమ్.. సుబ్బు మధ్య జరుగుతున్న కెమెస్ట్రీ చూసి నవ్వుకుంటారు. వీళ్ల మధ్య ఏదో జరగుతుందని.. డెఫనెట్లీ అందరూ అనుకునే ఉంటారు.
ఇంతలో యావర్ ప్రిన్స్ రతిక ఎంగేజ్ మెంట్ ఇవ్వాళ అంటూ.. ప్రియాంక, సుబ్బు చేసే రచ్చను చూస్తూ.. యావర్ ప్రిన్స్ ఓ పక్క సిగ్గుపడిపోతూ ఉంటే.. మరో పక్క ‘ఇదేందే తల్లి .. రాత్రి నుంచి ఏమవుతుందే తనకి’ అంటూ నవ్వుకుంటుంది రతిక.
ఇక మరో పక్క యావర్ ప్రిన్స్ ఆఫ్ న్యూడ్‌గా తన కండలు చూపిస్తూ.. ఏకంగా బిగ్ బాస్‌కే ఐహేట్ అంటూ.. చెబుతాడు. గేమ్లో తనకు అన్ ఫేర్ జరిగిందని.. అదే విషయాన్ని పదే పదే చెబుతాడు. ఇక రతిక తన ప్రెడిక్షన్స్‌తో.. శివాజీని తికమక పెట్టే ప్రయత్నాన్ని ఇంకో పక్క చేస్తుంటుంది. శివాజీ గురించి దామిని అప్పుడెప్పుడో .. చేసిన కామెంట్‌ను.. ఆయనకు చెబుతూ.. ఉంటుంది. ఈ క్రమంలోనే గౌతమ్ ఒక్కడే ఈ షోలో వీక్ అనుకుంటున్నా అని శివాజీ అంటే.. వీక్ కాదు.. రాంగ్ పర్సన్ అంటూ రతిక అంటుంది. గౌతమ్ అసలు డాక్టర్ కూడా చదివివుండడు అంటూ.. పర్సనల్ గా కామెంట్స్ చేస్తుంది.
ఇక హౌస్‌లో అందరికీ అమ్మ అయిపోయిన షకీలా..గౌతమ్, ప్రిన్స్ యావర్‌ను కలిపిస్తేంది. ఇద్దర్నీ హగ్ చేసుకోమని కలుపుతుంది. ఇక ఈ క్రమంలోనే.. హౌస్ మేట్స్ డిమాండ్ మేరకు.. గౌతమ్ సుబ్బును కూడా హగ్ చేసుకోమని చెబుతుంది. ఇక ఇది చూసిన ప్రిన్స్ రతికతో హగ్ కావాలని షకీలాను అడగడంతో.. వారిద్దరినీ కూడా హగ్ చేసుకోమంటుంది షకీలా. కానీ రతిక ప్రిన్స్‌కు తన మీద ఫీలింగ్స్ ఉన్నాయి కనుక.. హగ్ చేసుకోను అంటూ.. ఫ్రెండ్ అని అదేదో సినిమాలోలా.. చేతి వేళ్లను కలిపి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇక భగ్న ప్రేమికుడు ప్రశాంత్ తో కూడా ఇదే చేస్తుంది.
ఇక తరువాత సీన్లో శివాజీ.. రతికి, ప్రిన్స్, రైతు బిడ్డ మద్య ఇంట్రెస్టింగ్ కన్వర్‌జేషన్ జరుగుతుంది. రతికను వదిన అని పిలువమని.. రైతు బిడ్డకు యావర్ చెప్పడంతో.. రైతు బిడ్డ షాకవుతాడు. ప్రేమిస్తే సినిమాలో హీరో భరత్లా నవ్వుతుంటాడు. ఇక దీన్ని పక్కకు పెడితే.. యావర్‌ను ఉపయోగించుకుని.. రతిక ఎందుకో కావాలనే.. రైతు బిడ్డ ప్రశాంత్ ను పోక్ చేస్తున్నట్టు.. చూసిన వారికి అనిపిస్తుంది.
ఇక ఇంతలో హౌస్ మేట్స్ ముందుకు వచ్చిన కింగ్ నాగార్జున.. కింగ్ మీటర్ సాయంతో.. ‘ఈ వీక్ లో.. మీరు ఆడిన ఆటను జెడ్జ్ చేస్తానంటూ..’ చెబుతాడు. అమర్‌దీప్, శివాజీ, షకీలా.. వీరి మధ్య రెండో పవరాస్త్రను పొందేందుకు జరిగిన సౌండ్ టాస్క్‌లో.. శివాజీ గట్టిగా అరిచి గెలుపొందారని నాగార్జున అనౌన్స్ చేస్తారు. శివాజీ సెకండ్ కన్ఫర్మర్డ్ హౌస్ మేట్ అని.. ఇక నుంచి వీఐపీ రూమ్‌ను వాడుకోవచ్చని చెబుతారు. ఇక శివాజీ ఈ అవార్డ్‌ను తన కొడుకు రిక్కీకి డెడికేట్ చేస్తాడు. ఇక ఈ క్రమంలో.. అమర్‌దీప్ బీటెక్ కష్టాల మోనో డైలాగ్ పై కామెడీ చేస్తారు కింగ్.
ఇక శివాజీతో.. కింగ్స్ మీటర్ గేమ్‌ను స్టార్ట్ చేసిన కింగ్ నాగ్.. మీటర్‌లోని ముళ్లును గ్రీన్ పైకి తీసుకొస్తారు. అంటే.. శివాజీకి కింగ్ నాగ్ గ్రీన్ ఇచ్చారు. గేమ్, మైండ్ గేమ్, టీం మేనేజ్‌మెంట్ ఇలా అన్నింటిలో సూపర్బ్ అన్నారు. కానీ కట్ చేస్తే.. పెద్ద ట్విస్ట్ ఇస్తూ.. శివాజీకి తన వీడియోను చూపిస్తాడు కింగ్. ఇక ఆ వీడియోలో.. శివాజీ మాటి మాటికి ‘తలుపు తీరా స్వామి’.. ‘నన్ను ఎలిమినేట్ చేయండి’ అని చెప్పడాన్ని చూపించి.. కింగ్స్ మీటర్‌లో తన పర్ఫర్మెన్స్ ముళ్లును.. గ్రీన్ నుంచి.. యెల్లోకి మార్చేస్తారు. చిన్న క్లాస్ పీకుతారు. అంతేకాదు.. హౌస్‌లో ఉన్న శివాజీ బ్యాటరీని కూడా.. గ్రీన్ నుంచి యెల్లోకి తగ్గిస్తూ.. శిక్షిస్తారు నాగ్.
శివాజీ తర్వాత.. అమర్‌దీప్ దగ్గరికి వచ్చిన నాగ్.. కింగ్స్ మీటర్లో గ్రీన్ ఇస్తారు. తన గేమ్ ఇంప్రూవ్ అయ్యావ్ అని మెచ్చుకుంటూనే.. పోయిన వారం జరిగిన నామినేషన్లో.. రైతు బిడ్డను నామినేట్ చేస్తూ.. అమర్ చెప్పిన మోనోలాగ్ ఇర్రిలవెన్స్ అంటూ.. నాగ్ చెప్పే ప్రయత్నం చేస్తారు. నామినేషన్‌కు ఇది కారణం కాదంటూ.. వారిస్తారు.
ఇక కింగ్ మీటర్లో షకీలాకు యెల్లో ఇచ్చిన నాగ్.. వయసుకు తగ్గట్టు కాదు వయసుకు మించి ఆడాలని సూచిస్తారు. ఇంట్లో పెద్దమనిషిలా ఉంటున్నారు… అందర్నీ కలుపుతారు అంటూ..అప్రిషియేట్ చేస్తారు.
ఫస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ సందీప్‌కు కూడా కింగ్స్ మీటర్లో.. గ్రీన్ ఇచ్చిన నాగ్.. తన గేమ్‌ను అప్రిషియేట్ చేశారు. కానీ పవరాస్త్రను కాపాడుకోవడం కూడా తన బాధ్యతంటూ.. సూచిస్తారు. సందీప్‌కు పవరాస్త్ర పోయిందనే విషయం తెలియడానికి తేజు కారణం అంటూ.. రివీల్ చేసి.. ‘సీక్రెట్స్ దాచేయాలి.. చెప్పద్దు’ అంటూ.. దామనికి సూచిస్తారు నాగ్.
పవరాస్త్రను దొంగిలించిన సుబ్బు.. ఇంకో రెండు గంటలు.. ఆ అస్త్రాన్ని హోల్డ్ చేయగలిగి ఉంటే.. పవరాస్త్ర తన దయ్యేదని చెప్పిన నాగ్.. ఆ స్టేట్మెంట్‌తో.. సుబ్బుకు షాకిస్తారు. కానీ తేజు కారణంగా.. తను ఓడిపోయిందని.. తేజును కార్నర్ చేస్తారు నాగ్. ఇక సుబ్బు గేమ్‌ను మెచ్చుకుంటూనే.. తాను ఆడిన ఆట సరిపోదంటూ.. రెడ్ ఇస్తారు.
ప్రియంకకు కూడా ఆట మెరుగుపరుచుకోవాలని నాగ్ రెడ్ ఇస్తారు. ట్విస్టర్ గేమ్‌లో.. సందీప్ బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కిందే.. ప్రియాంక గెలిచనట్టు తీర్పుఇచ్చాడని.. కానీ నిజానికి ప్రియాంక గెలవలేదంటూ.. నిజాన్ని చెబుతారు. అంతే కాదు గేమ్‌లో.. రిజెల్ట్‌లో.. ఏదైన డౌట్ వస్తే.. బిగ్ బాస్‌ను అడగాలి అంటూ.. సందీప్‌కు గట్టిగా చెబుతారు నాగ్.
ఇక ప్రశాంత్ దగ్గరికి వచ్చిన కింగ్.. తననే అసెస్‌మెంట్ చేసుకోమని చెబుతారు కింగ్ నాగ్. అందుకు రైతు బిడ్డ యెల్లో అనడంతో.. నాగ్ అంతకంటే ఎక్కువంటూ.. గ్రీన్ ఇస్తారు. ఆట బాగుంది అంటూ.. మెచ్చుకుంటారు. తన వల్లే.. మహాబలి టీం ఓ టాస్క్‌లో గెలిచిందని గుర్తు చేస్తూ.. అప్రిషియేట్ చేస్తారు. కానీ ఈక్రమంలోనే రైతు బిడ్డ పరువు తీసేశారు నాగ్. రైతు బిడ్డ అని చెప్పుకునే ప్రశాంత్.. తనకిచ్చిన మొక్కే కాపాడుకోలేపోయాడని .. విమర్శిస్తారు. కెమరాలకు.. ప్లైయింగ్ కిస్సులు, పిల్లో పై పీ, ఆర్ అని అక్షరాలు రాయడాలు మానేసి గేమ్ పై ఫోకస్ చేయాలని సూచిస్తారు. రతిక విషయంలో ప్రిన్స్ నుంచి పోటీ వచ్చిందా అని రైతు బిడ్డను నాగ్ అడగగా అవును అంటూ చెప్పి.. నాగ్‌తో పాటు కంటెస్టెంట్స్ అందర్నీ నవ్వించేస్తారు.
ఇక యావర్ కూడా బాగా ఆడాడని.. రణధీర టీంకు బ్యాక్ బోన్ అయ్యావని.. చెబుతూ.. కింగ్స్ మీటర్లో గ్రీన్ ఇస్తారు నాగ్. ఎఫర్ట్ పెట్టినా రిజెల్ట్ రాకపోతే ఎవరికైనా బాధేస్తుందని.. కానీ ఏదైనా కామ్ గా చెప్పడానికి ట్రై చేయాలని ప్రిన్స్కు సూచిస్తారు. హౌస్‌లోనే కాదు.. జనాలు ఎక్కడ ఉంటే.. అక్కడ రాజకీయాలు ఉంటాయని.. తన గేమ్‌తో వాటిలో సర్‌వైవ్ అవ్వాలని కంప్లైట్ చేయొద్దంటూ చెబుతారు.
ఇక గౌతమ్ వర్సెస్ ప్రిన్స్ టాపిక్ ఎత్తిన నాగ్.. ప్రిన్స్ స్టెరాయిడ్స్ తీసుకున్నాడంటూ.. చేతితో ఇంజెక్షన్ సైన్ చేసి ప్రొవోక్ చేయడం ముమ్మాటికే తప్పంటూ.. చెప్పారు నాగ్. గౌతమ్‌తో ప్రిన్స్కు సారీ చెప్పించారు. షర్ట్ విప్పి బాడీ చూపించమని.. గౌతమ్‌కు ఆదేశించి.. ‘నీది కూడా స్టెరాయిడ్ బాడీనా’ అంటూ.. కొశ్వన్ చేస్తారు. అలా ఎవరి కష్టాన్ని ఒక్క మాటతో.. వృథాగా తీసేయడం చేయొద్దంటూ గౌతమ్‌కు చెబుతారు నాగ్. ఇక అలా చెప్పే క్రమంలోనే గౌతమ్‌కు రెడ్ ఇస్తారు. మహాబలి టీం క్యాప్టెన్‌గా ఫెయిల్ అయ్యాడని.. తన సెల్ఫ్ పర్ఫార్మెన్స్‌లో… వెనకపడ్డావని చెబుతారు నాగ్. క్యాప్టెన్‌గా ఫెయిల్ అంటూ.. కుండబద్దుకొట్టినట్టు చెబుతారు.
ఇంగ్లీష్ వింగ్లీష్ స్పీకింగ్ లేడీ అంటూ.. దామినిని కోట్ చేసిన నాగ్.. తనకి కూడా కింగ్స్ మీటర్లో రెడ్ ఇస్తారు. దాంతోపాటే.. రతిక, దామిని మధ్య జరిగిన గొడవలో ఎందుకు ఏడవాల్సి వచ్చిందో అడిగి మరీ తెలుసుకున్నారు. కార్తీక దీపం విలన్ శోభకు కూడా కింగ్స్ మీటర్లో రెడ్ ఇచ్చారు నాగ్.
ఇక అందరూ ఎదురుచూస్తున్నట్టు రతికా రోజ్ దగ్గరికి వచ్చిన కింగ్ నాగ్.. కింగ్స్ మీటర్లో.. రెడ్, యెల్లో కి మధ్యలో తన మీటర్ ముళ్లు ఉందంటూ.. కింగ్స్ మీటర్‌ను జరుపుతారు. ఒకటే విషయాన్ని ఎక్కువగా లాగితే తెగిపోతుందంటూ.. ఇది టీం గేమ్ .. తన ఒక్కరి గేమ్ కాదంటూ క్లాస్ పీకుతారు. కానీ చివర్లో.. ‘ఆట ఆడమ్మా.. మనుషులతో ఆడుకోవద్దు అంటూనే తన మాటలు అర్థమయ్యాయని అనుకుంటున్నా’ అంటూ.. రతికను వార్న్ చేస్తారు నాగ్. ఇక మరో కంటెస్టెంట్ తేజు ఆట.. పడుకోవడమే అంటూ.. ఓ వీడియోను చూపించి అందర్నీ నవ్వించారు నాగ్. దాంతో పాటే.. తేజకు మరో వారం బాత్రూమ్‌లు కడగాలంటూ.. పనిష్మెంట్ ఇస్తారు. శివాజీని పర్యవేక్షించాల్సిందిగా ఆదేశిస్తారు.
ఇక నామినేషన్లో ఉన్న శివాజీ, షకీలా, తేజ, శోభ, రైతు బిడ్డ, గౌతమ్, రతిక, అమర్, ప్రిన్స్! ఈ తొమ్మింది మందిలో.. పవరాస్త్రను గెలుచుకుని శివాజీ సేవ్ అయ్యారని చెప్పిన నాగ్.. ఆ తరువాత వారిపేర్లతో ఉన్న మాయాస్త్ర బాక్సుల్లో.. రెడ్ ఉన్న వాళ్లు అన్ సేఫ్ అని.. గ్రీన్ ఉన్న వాళ్లు సేఫ్ అని చెబుతారు. ఇక ఈ క్రమంలోనే అమర్‌కు గ్రీన్ రావడంతో.. సేఫ్ అవుతాడు. అలా శనివారం ఎపిసోడ్‌లో.. శివాజీ, అమర్ ఎలిమినేషన్స్ నుంచి సేఫ్ అవుతారు. స్టిల్ ఈ వారం ఎవరు ఎలిమేట్ అవుతారనే క్యూరియాసిటీని.. బిగ్ బాస్ లవర్స్‌లో.. బిగ్ బస్ ఇంకా అలానే హోల్డ్ చేసి ఉంచుతారు.
– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.