Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో చిగురించిన కొత్త ప్రేమ.. ముక్కలైన రైతు బిడ్డ గుండె..!
బిగ్ బాస్ అంటే.. టాస్కులు.. గొడవలు.. పొట్లాటలు.. మాత్రమే కాదు..! ఏడుపులు.. పెడబొబ్బలు.. నిబంధనలు కూడా కాదు..! ప్రేమలు.. చిలిపి వేషాలు.. చిన్న చిన్న రొమాంటిక్ మాటలు, ఇవి కూడా! ఆ... చిన్న కరెక్షన్.. ఇవి కూడా కాదు..! ఇవే మొత్తం! ఎస్! బిగ్ బాస్ సీజన్ 1 మొదలైంది మొదలు.. ప్రతీ సీజన్లో ఓ ఇద్దరి మధ్య నడిచే ప్రేమాయణం..ఆ సీజన్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.
బిగ్ బాస్ అంటే.. టాస్కులు.. గొడవలు.. పొట్లాటలు… మాత్రమే కాదు..! ఏడుపులు.. పెడబొబ్బలు.. నిబంధనలు కూడా కాదు..! ప్రేమలు.. చిలిపి వేషాలు.. చిన్న చిన్న రొమాంటిక్ మాటలు, ఇవి కూడా! ఆ… చిన్న కరెక్షన్.. ఇవి కూడా కాదు..! ఇవే మొత్తం! ఎస్! బిగ్ బాస్ సీజన్ 1 మొదలైంది మొదలు.. ప్రతీ సీజన్లో ఓ ఇద్దరి మధ్య నడిచే ప్రేమాయణం.. ఆ సీజన్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అందులోనూ… యూత్‌ను విపరీతంగా కట్టిపడేస్తుంటుంది. ఇక తాజాగా జరిగిన బగ్ బాస్ సీజన్ 7లోనూ.. అదే జరుగుతోంది. ఈ సీజన్ వెరీ బిగినింగ్ నుంచే.. షో మొత్తం ప్రేమ పారుతోంది. ఇక మొదట, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. రతిక మధ్య మొదలైన ఈ ప్రేమ టాపిక్ … ఈ షోకు భారీగానే రెస్పాన్స్ వచ్చేలా చేసింది. అమాయకపు మాటలతో.. ప్రశాంత్.. పల్లవి పటాయించాలని చూడడం .. అందర్నీ ఎంటర్ టైన్ చేస్తుంది. పల్లవి ప్రశాంత్ రతికకు .. ప్లైయింగ్ కింగ్ ఇవ్వడం.. రతిక పొట్టి బట్టలు వేసుకుంటే ఫీలవడం.. ఆ పిల్ల నాదంటూ.. డైలాగులు చెప్పడం..! అందరికీ సిల్లీగా అనిపిస్తూనే.. రతిక పై ప్రశాంత్కున్న ప్రేమ తెలిసేలా చేస్తుంది. కానీ నామినేషన్స్ కారణంగా.. గొడవ పెట్టుకుని మరీ ప్రశాంత్‌తో విడిపోయిన రతిక.. తాజాగా ప్రిన్స్ యావర్ గుండెల్లో చిచ్చు పెట్టేసింది. తన అందంతో.. యాటిట్యూడ్తో.. చలాకీ మాటలతో.. ప్రిన్స్‌లో ఫీలింగ్స్ కలిగించింది. దీంతో ప్రిన్స్ తాజాగా రతిక మీద ఫీలింగ్స్ ఉన్నాయంటూ.. ప్రేమిస్తున్నా అంటూ.. ఏకంగా రైతు బిడ్డకే చెబుతాడు. దీంతో రైతు బిడ్డ ఏం చెప్పాలో అర్థం కాక.. ఈ ప్రేమేందో అంటూ.. తన స్టైల్లో చిరాకు పడతాడు. అయితే ఇదే సీన్ ఇప్పుడు మరో సారి రైతు బిడ్డను నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తోంది. పాపం రైతు గుండె ముక్కలైనట్టుంది అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..