- Telugu News Photo Gallery Cinema photos Guess This Hero In This Photo Who Looks Unrecognisable , It Is Navdeep New Look From Love Mouli Movie
Tollywood: గుబురు గడ్డంతో ఉన్నఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా? ఈ మధ్య న్యూస్‌లో బాగా వినిపిస్తోన్న పేరు
ఈ ఫొటోలో గుబురు గడ్డం పెంచుకుని బైక్ పై చక్కర్లు కొడుతోన్న టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా? కెరీర్ ఆరంభంలో ప్రేమకథా చిత్రాలతో యూత్‌ను ఆకట్టుకున్నాడీ నటుడు. సోలో హీరోగా మెప్పించాడు. ఆ తర్వాత స్పెషల్ రోల్స్‌తో ఆడియెన్స్‌ను అలరించాడు. మళ్లీ ఇప్పుడు హీరోగా మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.
Updated on: Sep 17, 2023 | 3:16 PM

ఈ ఫొటోలో గుబురు గడ్డం పెంచుకుని బైక్ పై చక్కర్లు కొడుతోన్న టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా? కెరీర్ ఆరంభంలో ప్రేమకథా చిత్రాలతో యూత్‌ను ఆకట్టుకున్నాడీ నటుడు. సోలో హీరోగా మెప్పించాడు. ఆ తర్వాత స్పెషల్ రోల్స్‌తో ఆడియెన్స్‌ను అలరించాడు. మళ్లీ ఇప్పుడు హీరోగా మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇందులో కనిపిస్తున్నది మరెవరో కాదు.. టాలీవుడ్ హీరో నవదీప్. అతను నటిస్తున్న తాజా చిత్రం లవ్ మౌళి. ఇందులో గతంలో ఎప్పుడూ చూడలేని విధంగా పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు నవదీప్.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఇదే మూవీ నుంచి 'ద ఏంథమ్ ఆఫ్ లవ్ మౌళి' పాటను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇందులోనూ సరికొత్త మేకోవర్‌తో కనిపించాడు నవదీప్. సరికొత్త మేకోవర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం నవదీప్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లవ్ మౌళి సినిమాకు అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నైరా క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్న ఈ సినిమాలో పంఖురి గిద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఇటీవల డ్రగ్స్ పేరులో నవదీప్ పేరు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.