Shraddha Das: బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హాట్ బ్యూటీ శ్రద్దా దాస్..
శ్రద్దాదాస్.. ఈ అమ్మడి గురించి.. ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించిన శ్రద్ధాదాస్ ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. డార్లింగ్, ఆర్య 2 సినిమాల్లో కనిపించింది శ్రద్ధాదాస్. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్రద్ధాదాస్. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ అందాల భామ. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.